న్యూఢిల్లీ: మే 23న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష

న్యూఢిల్లీ: మే 23న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష

న్యూఢిల్లీ: దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌‌‌‌డ్ 2027 పరీక్ష తేదీ ఖరారైంది. ఇండియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2027 సంవత్సరానికి సంబంధించిన జేఈఈ అడ్వాన్స్‌‌‌‌డ్ పరీక్షను మే 23న నిర్వహిస్తున్నారు. 

ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హత ప్రమాణాలు, సిలబస్‌‌‌‌ తదితర సమాచారం కోసం అధికారిక వెబ్‌‌‌‌సైట్ jeeadv.ac.in ను అందుబాటులోకి తెచ్చినట్లు ఐఐటీ ఢిల్లీ వెల్లడించింది. ఆశావహులైన అభ్యర్థులు తాజా అప్‌‌‌‌డేట్ల కోసం ఈ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను సందర్శించాలని సూచించారు. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌‌‌‌డ్ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం ఐఐటీ ఢిల్లీ ఆన్‌‌‌‌లైన్ బేసిక్ (నాన్-సైంటిఫిక్) కాలిక్యులేటర్‌‌‌‌ను ఉపయోగించుకునే సదుపాయాన్ని కల్పించింది.