
ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్న భారతీయుల పరిస్థితి ముందు నుయ్యి వెనకచూస్తే గొయ్యి అన్నట్లుగా మారింది. అవును ఒకపక్క ట్రంప్ కొత్త హెచ్1బి వీసాలపై రుసుములు పెంచేయగా.. కనీసం ఇప్పటికే హెచ్1బి కలిగిన ఇండియన్స్ అక్కడ పని కొనసాగించటానికి కుదరటం లేదు. ట్రంప్ అమెరికన్లకే ఉద్యోగాలు కల్పించాలనే బలమైన నిర్ణయంతో కొన్ని కంపెనీలు పనితీరుతో సంబంధం లేకుండానే ఇండియన్ వర్కర్స్ ని పనిలో నుంచి అర్థాంతరం తొలగించేస్తున్నాయి. కనీసం కలలో కూడా ఊహించని విధంగా ప్రవర్తిస్తున్నాయి.
తాజాగా ఒక అమెరికా కంపెనీ అక్కడ.. భారతీయ ఉద్యోగులను ఆకస్మికంగా లేఆఫ్ చేసింది. జస్ట్ నాలుగు నిముషాల Zoom కాల్ ద్వారా నోటీసు ఇవ్వకుండా లేఅఫ్ జరిగిందని అక్కడ పనిచేస్తున్న ఒక ఉద్యోగి రెడ్డిట్ పోస్టులో పేర్కొన్నాడు. రోజూ తాను 9 గంటలకు లాగిన్ అవుతానని.. అర్జెంట్ కాల్ అంటూ 11 గంటలకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జూమ్ మీటింగ్ పెట్టారని చెప్పాడు. కెమెరాలు, మైక్రోఫోన్లు అన్ని డిసేబుల్ చేసి కంపెనీలోని భారత ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెప్పి కాల్ కట్ చేసినట్లు చెప్పాడు. వర్క్ పర్ఫామెన్స్ ఆధారంగా ఈ తొలగింపులు జరగటం లేదని తన బాస్ చెప్పినట్లు రెడ్డిట్ యూజర్ పేర్కొన్నాడు.
ALSO READ : అమ్మకాల్లో మారుతీ, మహీంద్రా, హ్యుందాయ్ మోడళ్లను దాటేసిన టాటా కారు..
కంపెనీ తమకు ఈ నెల జీతం పూర్తిగా ఇస్తామని, అలాగే మిగిలి ఉన్న పెయిడ్ లీవ్స్ డబ్బు చెల్లిస్తామని చెప్పారు. తమ అభిప్రాయం వినటానికి కూడా సీఓఓ సమయం ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. ఇలాంటి అకస్మిక లేఅఫ్ ప్రక్రియలు అమెరికాలో.. ముఖ్యంగా భారతీయ ఉద్యోగులతో కూడిన టెక్ కంపెనీలలో ప్రస్తుతం పెరుగుతున్నాయి. ఇది ఉద్యోగులతో సరైన కమ్యూనికేషన్ లేకుండా.. అనుకోకుండా జరిగినట్లు భావించబడుతుంది. ఈ ఘటనపై ఆన్‌లైన్ లో ట్రోలింగ్, విమర్శలు వినిపిస్తున్నాయి.
దశాబ్ధానికి పైగా అమెరికాలో భారతీయ ఉద్యోగులు టెక్నాలజీ, ఫైనాన్స్ మొదలైన రంగాల్లో విస్తృతంగా పనిచేస్తున్నారు. ఉద్యోగాల భద్రత విషయంలో ఇటీవల కొన్ని సంస్థలు సంస్థలో సంక్షోభాలు ఎదుర్కొంటూ, మినహాయింపులు లేకుండా, ముఖ్యంగా జూమ్ లాంటి ఆన్‌లైన్ కాల్ ద్వారా నిమిషాల్లో లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఈ విధానం ఉద్యోగులపై మానసికంగా, ఆర్థికంగా చాలా ప్రభావం చూపుతూ వారి భవిష్యత్తుపై ఆందోళనలు రేకెత్తిస్తోంది.