అమ్మకాల్లో మారుతీ, మహీంద్రా, హ్యుందాయ్ మోడళ్లను దాటేసిన టాటా కారు.. సెప్టెంబర్ బెస్ట్ సెల్లర్..!

అమ్మకాల్లో మారుతీ, మహీంద్రా, హ్యుందాయ్ మోడళ్లను దాటేసిన టాటా కారు.. సెప్టెంబర్ బెస్ట్ సెల్లర్..!

జీఎస్టీ తగ్గింపులు అమలులోకి వచ్చిన సెప్టెంబర్ సేల్స్ ఆటో కంపెనీల కొత్త చరిత్రకు కారణంగా మారుతున్నాయి. జీఎస్టీ రాయితీలు ఆవిరి కాకమునుపే నచ్చిన కారు లేదా బైక్ కొనాలని ప్రజలు ఉత్సాహం చూపటంతో అమ్మకాలు రికార్డు స్థాయిల్లోనే జరిగాయి. 

ఈ క్రమంలోనే టాటా మోటార్స్ ఎస్ యూవీ మోడల్ నెక్సన్ సెప్టెబరులో టాప్ సెల్లర్ గా నిలిచింది. దేశంలోని ఇతర ప్రధాన ఆటో దిగ్గజాలైన మారుతీ సుజుకీ, మహీంద్రా, హ్యుందాయ్ కి చెందిన అన్ని మోడల్ అమ్మకాలను నెక్సన్ క్రాస్ చేసింది. సెప్టెంబర్ నెలలో ఏకంగా టాటా మోటార్స్ 22వేల 573 నెక్సన్ కార్లను అమ్మి గత నెలవారీ రికార్డులన్నింటిని బద్ధలు కొట్టేసింది. పైగా టాటా సంస్థకు చెందిన మరే ఇతర కారు కూడా అమ్మకాల్లో దీని తగ్గరకు రాలేకపోయాయి. 

3 సంవత్సరాలుగా ఎస్ యూవీలలో టాటా నెక్సన్ వరుసగా భారీ అమ్మకాలను చూస్తోంది. 2022 ఆర్థిక సంవత్సరంలో లక్ష 24వేల కార్లు, 2023లో లక్ష 72వేల యూనిట్లు అలాగే 2024 ఆర్థిక సంవత్సరంలో లక్ష 71వేల కార్లు అమ్ముడయ్యాయి. ఇక కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కాలంలో 90వేలకు పైగానే కార్లు అమ్ముడయ్యాయని కంపెనీ వెల్లడించింది. ప్రధానంగా జీఎస్టీ తగ్గింపులతో కారు రేటు రూ.లక్షా 55వేల వరకు తగ్గటంతో పాటు టాటా గ్రూప్ రూ.45వేల వరకు బెనిఫిట్స్ ఆఫర్ చేయటంతో అమ్మకాలు భారీగా పెరిగాయి. 

ALSO READ : TCSపై యూఎస్ సెనెటర్ల ప్రశ్నల వర్షం..

ప్రస్తుతం ధరలు తగ్గాక టాటా నెక్సన్ కార్లు స్టార్టింగ్ బేస్ వేరియంట్ రేటు రూ.7లక్షల 32వేల నుంచి మెుదలవుతున్నాయి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, సీఎన్జీతో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్లలో నెక్సన్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇక సేఫ్టీ విషయంలో కార్లు 5 స్టార్ రేటింగ్ కలిగి ఉండటంతో చాలా మంది దీనిపై మనసు పారేసుకుంటున్నారు. అలాగే 6 ఎయిర్ బ్యాగ్స్, బ్లైండ్ వ్యూ మానిటర్ వంటి ఫీచర్లు సేఫ్టీని పెంచేస్తున్నాయి. ప్రస్తుతం నెక్సన్.. సుజుకీ బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా  XUV 3XO, కియో సోనెట్, స్కోడా కైలక్ వంటి కార్లకు పోటీగా కొనసాగుతోంది.