ఇరాన్ తో యుద్ధం ముగిసిందని, నేవల్ బ్లాకెడ్ తొలగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించటంతో భారత స్టాక్ మార్కెట్లు సోమవారం దూసుకుపోతున్నాయి. మార్కెట్ల ప్రారంభం నుంచే కీలక బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను ప్రతిబింబిస్తున్నాయి. ప్రధానంగా క్రూడ్ దిగుమతులపై ఆధారపడే స్టాక్స్ లాభపడ్డాయి. ప్రధానంగా ఆటో, రియల్టీ, ఫైనాన్స్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లలో అమ్మకాల కోలాహలం కొనసాగుతుందోంది.
ఉదయం 9.41 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1060 పాయింట్ల లాభంతో ఉండగా, నిఫ్టీ 325 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 627 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 875 పాయింట్ల మేర లాభంలతో దూసుకుపోతున్నాయి. శుక్రవారం నాడు అమెరికా ఇరాన్ దేశాలు స్విడ్జర్లాండ్ కేంద్రంగా కాల్పుల విరమణ, యుద్ధం గురించి ఎంవోయూపై సంతకాలు చేయటంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయి.
ఈ కీలక పరిణామంయో భారతీయ కరెన్సీ రూపాయి మారకపు విలువ డాలరుతో పోల్చితే 43 పైసలు లాభపడింది. హార్మూజ్ జలసంధి తిరిగి తెరచుకోవటానికి ఏర్పాట్లు జరుగుతుండటంతో క్రూడ్ ధరలు కూడా తగ్గుతున్నాయి. ఈ క్రమంలో బ్రెంట్ క్రూడ్ ధర 4.6 శాతం తగ్గి బ్యారెల్ 83 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మార్చి నెల తర్వాత ఈ రేటుకు క్రూడ్ ధరలు పడిపోవటం ఇదే తొలిసారి కావటం గమనార్హం.
