ఫోన్ నెంబర్ మార్చుకోవడానికి ఇబ్బందులు..

ఫోన్ నెంబర్ మార్చుకోవడానికి ఇబ్బందులు..

దేశంలో తమ మొబైల్ నెంబర్ ను వేరే మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ కు  పోర్ట్ చేయడానికి వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో గత 24 నెలల్లో తమ నంబర్‌ను వేరే మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌కు పోర్ట్ చేసిన ప్రతీ నలుగురిలో ఒకరు ఇబ్బంది పడ్డట్లు ఓ నివేదిక వెల్లడించింది.  కేవలం 47 శాతం మంది వినియోగదారులు మాత్రమే పోర్టింగ్ ప్రక్రియను సులభతరంగా చేశారని ఈ  నివేదిక పేర్కొంది. 

ఆన్‌లైన్ కమ్యూనిటీ ప్లాట్‌ఫారమ్ లోకల్ సర్కిల్స్ ఓ సర్వే నిర్వహించింది.  భారతదేశంలోని 311 జిల్లాల్లో నివసిస్తున్న పౌరుల అభిప్రాయాలను సేకరించింది. 23,000 కంటే ఎక్కువ మంది ఈ అంశంపై స్పందించారు. ఇందులో  44 శాతం మంది టైర్ 1 నగరాల నుండి, 32 శాతం మంది టైర్ 2 నగరాల నుండి, 24 శాతం మంది ప్రతివాదులు టైర్ 3, 4 నగరాలు, గ్రామీణ ప్రాంతాల   నుండి ఉన్నారు. ఈ సర్వే నివేదిక ప్రకారం దేశంలో మొబైల్ నెంబర్ ను వేరే మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ కు  పోర్ట్ చేయడం చాలా కష్టమని 11 శాతం మంది వినియోగదారులు చెప్పారు. మరో 14 శాతం అత్యంత  కష్టం  అని పేర్కొన్నారు.  23 శాతం మంది యూజర్లు పోర్ట్ ప్రక్రియ కష్టం కాదు.. కానీ సులభం కూడా కాదని వెల్లడించారు. మరో  29 శాతం మంది చాలా సులభం తెలిపారు. మరో 18 శాతం మంది యూజర్లు పోర్టింగ్  అత్యంత  సులభం అని అన్నట్లు  నివేదిక వివరించింది. 

ALSO READ: ఈ ఐదు తెలిస్తేనే.. భవిష్యత్లో ఉద్యోగం.. లేకపోతే అంతే

ఈ సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  వినియోగదారులు  తమ నంబర్‌ను కొత్త ఆపరేటర్‌కు పోర్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు మొబైల్ సర్వీస్ ఆపరేటర్  అడ్డంకులు సృష్టించారట. అంతేకాదు పోర్టింగ్ ప్రాసెసింగ్‌లో నెమ్మదిగా ఉందంటూ పేర్కొన్నారని నివేదికలో యూజర్లు వెల్లడించారు.