న్యూఢిల్లీ: దేశంలో రిటెయిల్ ఇన్ఫ్లేషన్ ఏప్రిల్ నెలలో 4.7 శాతానికి దిగి వచ్చింది. ఆహార ఉత్పత్తుల రేట్లు తగ్గడం వల్లే రిటెయిల్ ఇన్ఫ్లేషన్ ఏప్రిల్ 2023 లో 18 నెలల కనిష్టానికి చేరినట్లు డేటా వెల్లడించింది. వరసగా రెండో నెలలోనూ దేశంలో రిటెయిల్ ఇన్ఫ్లేషన్ 6 శాతంలోపు రికార్డయింది. ఇది ఆర్బీఐ కంఫర్ట్ జోన్.
ఈ ఏడాది మార్చిలో రిటెయిల్ ఇన్ఫ్లేషన్ 5.66 శాతంగా ఉండగా, అంతకు ముందు ఏడాది ఏప్రిల్నెలలో 7.79 శాతం వద్ద నిలిచింది. అక్టోబర్ 2021 తర్వాత ఇంత తక్కువ ఇన్ఫ్లేషన్ ఏప్రిల్ 2023 లోనే నమోదయింది. ఫుడ్ బాస్కెట్ ఇన్ఫ్లేషన్ మార్చి 2023లోని 4.79 శాతం నుంచి ఏప్రిల్ 2023 లో 3.84 శాతానికి దిగిపోయిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) వెల్లడించింది. కిందటేడాది ఏప్రిల్ నెలలో ఫుడ్బాస్కెట్ ఇన్ఫ్లేషన్ 8.31 శాతం.
