ఈ అపార్ట్ మెంట్ ధర రూ.369 కోట్లు.. కొన్నది ఎవరో తెలుసా..

ఈ అపార్ట్ మెంట్ ధర రూ.369 కోట్లు.. కొన్నది ఎవరో తెలుసా..

అపార్ట్ మెంట్ అనగానే.. ఏ 50 లక్షలో.. కోటి రూపాయలో.. మహా అయితే నాలుగు, ఐదు కోట్ల దగ్గరే ఆగిపోతాం మనం.. ఆ అపార్ట్ మెంట్ ధర మాత్రం అక్షరాల 369 కోట్ల రూపాయలు. ఇది మన దేశంలో.. ముంబైలో జరిగిన లేటెస్ట్ డీల్. మార్చి 31వ తేదీ ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పటి వరకు ఇండియాలోనే అత్యంత ఖరీదైన అపార్ట్ మెంట్ గా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. ఓ అపార్ట్ మెంట్ ను 369 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయటం అనేది ఇదే ఫస్ట్ టైం.

ఇంతకీ ఈ అపార్ట్ మెంట్ కొన్నది ఎవరో తెలుసా.. ప్రముఖ ఫార్మా కంపెనీ అధినేత జేపీ తపారియా. ముంబై సిటీలోని వాకేశ్వర్ రోడ్డులో.. అరేబియా మహా సముద్రం ఒడ్డున లోధా కంపెనీ నిర్మిస్తున్న మలబార్ హిల్స్ టవర్స్ లో ఈ ప్లాట్లుకు కొనుగోలు చేశారు. ఈ టవర్ లోని 26, 27, 28 ఫ్లోర్ల మొత్తాన్ని బుక్ చేశారు. లగ్జరీ ట్రిబులెక్స్ ప్లాట్ గా దీన్ని తీర్చిదిద్దనున్నారు. 

మూడు ఫ్లోర్లు కలిపి మొత్తం 27 వేల 160 స్కైర్ ఫీట్ విస్తీర్ణం ఉండగా.. ఒక్కో స్కైర్ ఫీట్ ధర లక్షా 36 వేల రూపాయల ధర పలికింది. ఈ లెక్కన 369 కోట్ల రూపాయలతో అగ్రిమెంట్ చేసుకున్నారు జేపీ తపారియా. ఇండియాలోనే ఇది అత్యంత ఖరీదైన అపార్ట్ మెంట్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే టవర్ లో 121 కోట్ల రూపాయలతో మాధవ్ గోల్ అనే పారిశ్రామికవేత్త.. 19వ ఫ్లోర్ మొత్తాన్ని తీసుకున్నారు. అప్పట్లో అదే రికార్డ్ అనుకుంటే.. ఇది అంతకు మూడింతలు కావటం విశేషం. హైరైజ్ టవర్స్ లో.. అపార్ట్ మెంట్ పై 369 కోట్ల రూపాయల డీల్ జరగటం ఇదే ప్రథమం కావటంతో.. రియల్ ఎస్టేట్ రంగం మొత్తం అవాక్కయ్యింది.