కబిరా మొబిలిటీ కేఎం5000 పేరుతో హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకొచ్చింది. ఈ బండి టాప్ స్పీడ్ గంటకు 188 కి.మీ. సింగిల్ ఛార్జింగ్‌పై 344 కి.మీ వెళ్లగలదు. ఈ ఏడాది చివరిలో ఈ బైక్‌ను అఫీషియల్‌గా లాంచ్ చేస్తామని కంపెనీ పేర్కొంది. ధర రూ. 3.15 లక్షల (ఎక్స్ షోరూమ్ గోవా) నుంచి ప్రారంభమవుతుంది.
