దేశంలో తొలి ప్రైవేటు రైలు ప్రారంభం

దేశంలో తొలి ప్రైవేటు రైలు ప్రారంభం

దేశంలో తొలి ప్రైవేటు రైలు పట్టాలెక్కింది. భారత్ గౌరవ్ పేరుతో ప్రైవేటు రైళ్లను నడపనున్నట్టు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా తమిళనాడులోని కోయంబత్తూరులో నార్త్ నుంచి మహారాష్ట్రలోని షిరిడీ సాయినగర్ వరకు అధికారులు ఈ రైలును ప్రారంభించారు. మంగళవారం (జూన్ 15) సాయంత్రం 6గంటలకు బయలుదేరిన ఈ ట్రైన్ గురువారం (జూన్ 16) 7.25గంటలకు షిరిడీ చేరనుంది. అయితే ఈ ప్రైవేటు రైలును రైల్వే.. 2 సంవత్సరాలు లీజుకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ రైలు నెలలో కనీసం 3 ట్రిప్పులు తిరిగేలా అధికారులు ప్రణాళికలు చేశారు. 20 బోగీలు ఉన్న ఈ రైలులో కనీసం 1500మంది ప్రయాణించే అవకాశముందని దక్షిణ రైల్వే సీపీఆర్వో గుగణేశన్‌ తెలిపారు. అయితే ఇందులో ఏసీ కోచ్‌లతోపాటు స్లీపర్‌ కోచ్‌లు కూడా ఉన్నాయని గుగణేశన్ చెప్పారు.