సీనియర్ సిటిజన్స్ కోసం హైదరాబాద్ లో ప్రత్యేక జిమ్.. ఇండియాలోనే ఫస్ట్ టైం

సీనియర్ సిటిజన్స్ కోసం హైదరాబాద్ లో ప్రత్యేక జిమ్.. ఇండియాలోనే ఫస్ట్ టైం

దేశంలోనే మొదటిసారి సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకమైన జిమ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ. కొండాపూర్లో పచ్చనిప్రకృతి నిర్మలమైన వాతావరణం మధ్య బొటానికల్ గార్డెన్ లో దీనిని ఏర్పాటు చేశారు. ఈ బొటానికల్ గార్డెన్ ఔషధ మొక్కలు, దేశ, విదేశాలకు చెందిన వివిధ రకాల వృక్షజాలంతో నిండి ఉంటుంది. ఫిజికల్ సెంటర్ కోసం కొంతమంది డైలీ వ్యాయామం చేపే ఔత్సాహికుల కోరిక మేరకు.. కార్పొరేషన్‌ను సంప్రదించిన తర్వాత సీనియర్ సిటిజన్‌ల కోసం జిమ్‌ను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ముందుకు వచ్చింది.


ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి వ్యాయామశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వంటేరు మాట్లాడుతూ.. బొటానికల్ గార్డెన్‌కు ఉదయం, సాయంత్రం నడక కోసం రోజూ వందల సంఖ్యలో సందర్శకులు వస్తున్నారన్నారు. గార్డెన్‌లో శారీరక వ్యాయామం కోసం జిమ్ సౌకర్యం కల్పించాలని సీనియర్ సిటిజన్లు కోరారు. ఫ్లోర్ హడిల్స్, స్టెప్ , ర్యాంప్ అసిస్ట్, స్టెప్ అసిస్ట్, లెగ్ ఎక్స్‌టెన్షన్, వర్టికల్ షోల్డర్ పుల్, షోల్డర్ ట్విర్ల్స్ మొదలైన పరికరాలు గార్డెన్‌లోని సీనియర్ సిటిజన్‌లలో ఉత్సాహభరితమైన ఫిట్‌నెస్ ఫ్రీక్స్ కోసం అందుబాటులో ఉంచబడ్డాయని వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు.