కోటక్ ​గిల్ట్ ​ఫండ్​కు 25 ఏళ్లు

కోటక్ ​గిల్ట్ ​ఫండ్​కు 25 ఏళ్లు

న్యూఢిల్లీ :మనదేశంలోనే మొట్టమొదటి గిల్ట్ ఫండ్1 ఇటీవలే 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.  ప్రారంభమైనప్పటి నుంచి 25 సంవత్సరాలలో పెట్టుబడిదారులకు ఎటువంటి క్రెడిట్ నష్టం జరగలేదు. 29 డిసెంబర్ 1998న ప్రారంభమైన గిల్ట్ ఫండ్ అప్పటి నుంచి 8.99శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్​)ని అందించింది

మార్కెట్  హెచ్చు తగ్గులను తట్టుకుందని, ఆర్థిక రంగంలో కోటక్ గిల్ట్ ఫండ్ వృద్ధికి ధీటుగా నిలుస్తోందని కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌‌మెంట్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నీలేష్ షా చెప్పారు.  ఈ ఫండ్​ డబ్బును గవర్నమెంట్​సెక్యూరిటీల్లో పెడతామని చెప్పారు.