ప్రపంచానికి ఇండియా ఇచ్చిన గొప్ప గిఫ్ట్ యోగా: కోవింద్

V6 Velugu Posted on Jun 21, 2020

న్యూఢిల్లీ: ప్రపంచానికి ఇండియా ఇచ్చిన గొప్ప గిఫ్ట్‌ యోగా అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్ పైవిధంగా స్పందించారు. తాను యోగా చేస్తూ దిగిన పలు ఫొటోలను ప్రెసిడెంట్ కోవింద్ ట్వీట్ చేశారు.

‘అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రాచీన శాస్త్రం అయిన యోగా ప్రపంచానికి ఇండియా ఇచ్చిన గొప్ప బహుమతి. దీన్ని చాలా మంది స్వీకరిస్తుండటం హ్యాపీగా ఉంది. యోగా సాధన చేయడం ద్వారా శరీరాన్ని ఫిట్‌గా, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు’ అని కోవింద్ ట్వీట్ చేశారు.

ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయడు కూడా ఓ ట్వీట్ చేశారు. కరోనా నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ‘ఇంటి వద్దే యోగా, కుటుంబంతో యోగా’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వెంకయ్య చెప్పారు. ఫిజికల్ ఫిట్‌నెస్‌తోపాటు మెంటల్ ఫిట్‌నెస్‌ను సమతూకం చేసే యోగాను ప్రతి ఇండియన్ తమ జీవితాల్లో భాగం చేసుకోవాలని సూచించారు.

Tagged President Ram Nath Kovind, Vice President M Venkaiah Naidu, mental health, Physical Distance, International Yoga Day

Latest Videos

Subscribe Now

More News