‌‌‌‌‌‌‌ నీరజ్‌ ఈటె 90 మీ మళ్లీ దాటేనా..?

‌‌‌‌‌‌‌ నీరజ్‌ ఈటె 90 మీ మళ్లీ దాటేనా..?

చోర్జో (పోలెండ్‌‌‌‌‌‌‌‌): దోహా డైమండ్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌లో 90 మీటర్ల మార్క్‌‌‌‌‌‌‌‌ను అందుకున్న ఇండియా జావెలిన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ నీరజ్‌‌‌‌‌‌‌‌ చోప్రా.. మరో పోటీకి సిద్ధమయ్యాడు. నేడు జరిగే ఓర్లెన్‌‌‌‌‌‌‌‌ జానుస్జ్‌‌‌‌‌‌‌‌ కుసోనిస్కి టోర్నీలో మరోసారి ఈ మార్క్‌‌‌‌‌‌‌‌ను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. డైమండ్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌లో చోప్రా ఈటెను 90.23 మీటర్లు విసిరితే.. ఆఖరి ప్రయత్నంలో వెబర్‌‌‌‌‌‌‌‌ 91.06 మీటర్ల దూరం నమోదు చేసి గోల్డ్‌‌‌‌‌‌‌‌ నెగ్గాడు. 

అండర్సన్‌‌‌‌‌‌‌‌ పీటర్స్‌‌‌‌‌‌‌‌ (గ్రెనెడా), పోలెండ్ ప్లేయర్లు మార్సిన్‌‌‌‌‌‌‌‌ క్రుకోవిస్కి, సిప్రియన్‌‌‌‌‌‌‌‌ మ్రిజిగోల్డ్‌‌‌‌‌‌‌‌, డేవిడ్‌‌‌‌‌‌‌‌ వెగ్నర్‌‌‌‌‌‌‌‌, ఆండ్రియన్‌‌‌‌‌‌‌‌ మార్డరే (మాల్డోవా), అర్తుర్‌‌‌‌‌‌‌‌ ఫెల్‌‌‌‌‌‌‌‌ఫ్నెర్‌‌‌‌‌‌‌‌ (ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌) ఈ టోర్నీలో బరిలోకి దిగుతుండటంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. 2018లో 88 మీటర్లు దాటిన చోప్రా.. 90 మీటర్ల మార్క్‌‌‌‌‌‌‌‌ కోసం చాలా కష్టపడ్డాడు. చివరకు దోహాలో ఆ కల నెరవేరినా రాబోయే సీజన్‌‌‌‌‌‌‌‌లో ఈ దూరాన్ని మరింతగా పెంచుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో టోక్యోలో జరిగే వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో తన టైటిల్‌‌‌‌‌‌‌‌ను కాపాడుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడు.