
న్యూఢిల్లీ: దేశ కొత్త విద్య విధానాన్ని అత్యుత్తమంగా ఉండేలా రూపొందించామని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని నూతన విద్యా విధానాన్ని తయారు చేశామని తెలిపారు. అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ యానువల్ మీట్ లో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రతిభావంతులైన యువత సంఖ్య పెరగడం ఆత్మనిర్భర్ భారత్ కు దోహదం చేస్తోందని ప్రధాని పేర్కొన్నారు. దాదా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను మోడీ గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశాన్ని ప్రజాస్వామ్యపు విలువలతో ముందుకు నడపడంలో అంబేడ్కర్ కీలకపాత్ర పోషించారని చెప్పారు.