జీడీపీ వృద్ధి 7.3 శాతం.. ఈ ఏడాదిలోనూ ఇండియా టాపే: యూఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జీడీపీ వృద్ధి 7.3 శాతం.. ఈ ఏడాదిలోనూ ఇండియా టాపే: యూఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంచనాలు విడుదల చేసిన ప్రభుత్వం
  • మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లలో పెరగనున్న గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ : దేశ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి వృద్ధి చెందుతుందని ప్రభుత్వం పేర్కొంది.  2023–24 లో జీడీపీ గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 7.3 శాతం ఉంటుదని బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు విడుదల చేసే అడ్వాన్స్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఎస్టిమేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెల్లడించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గ్రోత్ రేట్ 7.2 శాతంగా ఉంది.  బ్లూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ ఎకనామిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మాత్రం దేశ జీడీపీ  2023–24 లో 6.7 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రోత్ రేట్ 7 శాతం దగ్గర ఉంటుందని లెక్కించింది. గ్రాస్ వాల్యూ యాడెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  6.9 శాతం  పెరుగుతుందని సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాటిస్టిక్స్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ప్రకటించింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఇది 7 శాతం పెరిగింది. అలానే బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెక్కల్లో వాడే నామినల్ జీడీపీ  8.9 శాతం పెరుగుతుందని పేర్కొంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో నామినల్ జీడీపీ గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 16.1 శాతంగా రికార్డయ్యింది.

కీలక సెక్టార్లలో గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంచనాలు..

1. అగ్రికల్చర్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2023–24 లో 1.8 శాతం వృద్ధి చెందుతుందని  ప్రభుత్వం అంచనా వేస్తోంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఈ సెక్టార్ 4 శాతం పెరిగింది.
2. మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4.6 శాతం (ఇయర్ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) నుంచి 8.1 శాతానికి  పెరుగుతుందని అంచనా.
3. మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గ్రోత్ అంచనాలను 6.5 శాతానికి పెంచారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1.3 శాతం వృద్ధి చెందింది.
4. ఎలక్ట్రిసిటీ , గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వాటర్ సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ , ఇతర యుటిలిటీ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కిందటి ఆర్థిక సంవత్సరంలో 9 శాతం పెరగగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.3 శాతం పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
5. కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ సెక్టార్ 10.7 శాతం, ట్రేడ్ , హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కమ్యూనికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్లు 6.3 శాతం పెరుగుతాయని అంచనా. కిందటి ఆర్థిక సంవత్సరంలో నమోదు చేసిన గ్రోత్ కంటే ఇది తక్కువ.
6. ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రియల్ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రొఫెషనల్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  8.9 శాతం పెరుగుతుందని, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  7.7 శాతం వృద్ధి చెందుతుందని  ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఖర్చులు ఇలా..

ప్రజల  వినియోగం  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.4 శాతం పెరుగుతుందని, ప్రభుత్వం చేసే  ఖర్చులు  4.1 శాతం పెరుగుతాయని సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  స్టాటిస్టిక్స్ ఆఫీస్ పేర్కొంది. ప్రైవేట్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు 10.3 శాతం వృద్ధి చెందుతాయని అంచనా వేసింది.

వేగంగా అభివృద్ధి చెందుతున్న  ఆర్థిక వ్యవస్థ...

ఈ ఏడాదిలోనూ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా  ఇండియా  నిలుస్తుందని యూఎన్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోసియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అఫైర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించింది.  దేశ జీడీపీ  2024 లో 6.2 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. డొమెస్టిక్ డిమాండ్ బాగుందని,  మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్లు విస్తరిస్తున్నాయని వివరించింది.

ఈ ఏడాది గాను యూఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్న ముఖ్యమైన అంశాలు..

1. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇండియా కొనసాగుతుంది. ఈ ఏడాది జీడీపీ 6.2 శాతం పెరుగుతుంది. ఇది 2023 లో వేసిన అంచనా 6.3 శాతం కంటే తక్కువ.

2. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు  ఇబ్బందులను ఎదుర్కొంటాయి. ఆర్థిక, వాణిజ్య పరమైన  పరిస్థితులు, పేమెంట్స్ సమస్యలు, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నినో వంటి వాతావరణ సమస్యలను ఎదుర్కొంటాయి.

3. కరోనా సంక్షోభం నుంచి చైనా ఎకానమీ అనుకున్నంత వేగంగా రికవరీ కావడం లేదు. డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, ఇంర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అనేక సమస్యలు నెలకొనడంతో ఈ దేశ ఎకానమీ నెమ్మదిగా రికవరీ అవుతోంది. 2022 లో చైనా ఎకానమీ 3 శాతం పెరగగా, 2023 లో 5.3 శాతం వృద్ధి చెందింది.

4.  వరుసగా రెండేళ్ల పాటు పెరిగిన గ్లోబల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 2023 లో కొంత తగ్గింది. కానీ, 2010–2019 మధ్య నెలకొన్న యావరేజ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ కంటే ఎక్కువ ఉంది. గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ 2022 లో 8.1శాతం ఉండగా, 2023 లో 5.7 శాతానికి తగ్గింది.

5. కమోడిటీ ధరలు తగ్గడంతో పాటు, మానిటరీ పాలసీలు సులభం అవుతుండడంతో గ్లోబల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ 2024 లో 3.9 శాతానికి తగ్గే ఛాన్స్ ఉంది.

6.  ఇండియన్ గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేపడుతున్న ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మల్టీ నేషనల్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల కారణంగా 2023 లో దేశంలోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి.

7.  మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనితీరును కొలిచే పీఎంఐ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  2023 సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అన్ని దేశాల్లో  50 కంటే దిగువన ఉండగా, ఒక్క ఇండియాలోనే ఎగువన నమోదయ్యింది.  మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక్క ఇండియాలోనే విస్తరిస్తోంది.

8. తమ  మాన్యుఫాక్చరింగ్ బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్చుకోవాలని చూస్తున్న చాలా కంపెనీలు ఇండియా వైపు చూస్తున్నాయి.

9. ఇండియాలో రిటైల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ 2024 లో 4.5 శాతానికి తగ్గుతుందని అంచనా. 2023 లో ఇది 5.7 శాతం దగ్గర ఉంది. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ పెట్టుకున్న మీడియం టెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 శాతం –6 శాతం రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఉంటుంది.

10.  సౌత్ ఆఫ్రికా, ఇండియా వంటి చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10 శాతం మంది (ధనవంతులు) ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరిగాయి.