న్యూఢిల్లీ: ఇండియా నుంచి యూఎస్‌కు కిందటేడాది ఏప్రిల్ – డిసెంబర్ మధ్య 3.53 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి అయ్యాయి. అంతకు ముందు ఏడాదిలో ఈ నెంబర్ 998 మిలియన్ డాలర్లుగా ఉంది. యూఎస్‌కు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లను ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇండియా మూడో ప్లేస్‌కు చేరుకుంది. దేశంలో స్మార్ట్‌ఫోన్ల తయారీ భారీగా పెరిగిందని, దీంతో ఎగుమతులు ఊపందుకున్నాయని కామర్స్ మినిస్ట్రీ పేర్కొంది. యూఎస్‌కు చైనా, వియత్నాం నుంచి ఎగుమతైన స్మార్ట్‌ఫోన్లు తగ్గాయి.
