జోరు సాగాలె..నేడు జింబాబ్వేతో ఇండియా మూడో టీ20

జోరు సాగాలె..నేడు జింబాబ్వేతో ఇండియా మూడో టీ20
  • సా. 4.30 నుంచి సోనీ స్పోర్స్‌‌లో

హరారే : రెండో టీ20లో భారీ విజయం సాధించిన టీమిండియా.. మూడో మ్యాచ్‌‌‌‌కు సిద్ధమైంది. బుధవారం జరిగే ఈ పోరులో జింబాబ్వేను ఓడించి సిరీస్‌‌‌‌లో ఆధిక్యంలో నిలవాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో ప్రస్తుతం ఇరుజట్లు 1–1తో సమంగా ఉన్నాయి. టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ విన్నర్లు సంజూ శాంసన్‌‌‌‌, యశస్వి జైస్వాల్‌‌‌‌, శివం దూబే రాకతో టీమిండియా తుది జట్టు ఎంపికపై కొంత సందిగ్ధత ఉంది. ముఖ్యంగా ఓపెనర్లలో కెప్టెన్‌‌‌‌ శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌కు తోడుగా యశస్వి, అభిషేక్‌‌‌‌లో ఎవరికి చాన్స్‌‌‌‌ ఇస్తారో చూడాలి.

 ఒకవేళ టాప్‌‌‌‌–3లో ఈ ముగ్గుర్ని కొనసాగిస్తే రుతురాజ్‌‌‌‌ నాలుగో ప్లేస్‌‌‌‌లో ఆడాల్సి వస్తుంది. ధ్రువ్‌‌‌‌ జురెల్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో శాంసన్‌‌‌‌ వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌గా రావొచ్చు. రియాన్‌‌‌‌ పరాగ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ దూబేకు దక్కనుంది. మరోవైపు జింబాబ్వే కూడా ఈ మ్యాచ్‌‌‌‌లో గెలుపే లక్ష్యంగా దిగుతోంది. అయితే బ్యాటింగ్‌‌‌‌, బౌలింగ్‌‌‌‌తో పాటు ఫీల్డింగ్‌‌‌‌నూ ఆ టీమ్‌‌‌‌ సత్తా చాటాలి.