ఎమర్జెన్సీ అప్రూవల్ కోసం మరో వ్యాక్సిన్

ఎమర్జెన్సీ అప్రూవల్ కోసం మరో వ్యాక్సిన్

జైకోవ్ డీ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ అప్రూవల్ కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు జైడస్ క్యాడిలా కంపెనీ దరఖాస్తు చేసుకుంది. తాము తయారు చేసిన డీఎన్ఏ వ్యాక్సిన్‌ను 12 నుంచి 18 వరకు పిల్లలకు ఇవ్వడానికి అనుమతి కోరింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ థర్డ్ ఫేజ్ ట్రయల్స్ కూడా పూర్తి చేసుకుంది. ఏడాదికి దాదాపు 120 మిలియన్ల డోసులు తయారు చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ జైకోవ్ డీ వ్యాక్సిన్‌కి డీసీజీఐ అనుమతిస్తే ఇండియాలో వాడకానికి పర్మిషన్ వచ్చిన ఐదో వ్యాక్సిన్‌గా గుర్తింపు పొందనుంది. ఇప్పటివరకు భారత్ బయోటెక్ కోవాగ్జిన్, మోడెర్నా, కోవిషీల్డ్, స్పుత్నిక్ వ్యాక్సిన్లకు ఆమోదం లభించింది. జైకోవ్ డీ థర్డ్ ఫేజ్ ట్రయల్స్‌లో మంచి పనితీరు కనబరచినట్లు కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపు 28 వేల మంది వాలంటీర్ల‌పై ప్రయోగాలు చేశామని.. అందులో 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు వెయ్యి మంది ఉన్నారని కంపెనీ తెలిపింది. ఈ వ్యాక్సిన్ మూడు డోసులను ఇవ్వాల్సి ఉంటుందని.. పైగా చిన్నారుల కోసం నీడిల్ రహితంగా రూపొందించినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఈ ట్రయల్స్ నిర్వహించారు.