మనిషి సగటు జీవితకాలం రెండేళ్లు పెరిగిందంట!

మనిషి  సగటు జీవితకాలం రెండేళ్లు పెరిగిందంట!

మామాలుగానే మనిషికి ప్రాణం మీద తీపి ఎక్కువ. ఇప్పుడు కరోనా పుణ్యమా అని అది మరింత ఎక్కువైంది. ఆ బాధ లాక్ డౌన్లో సొంత వాళ్లను పోగొట్టుకొని అనాథలైన వారికే ఎక్కువ తెలుస్తుందేమో.  నిన్నటి వరకూ మనతో జాలీగా తిరిగన వ్యక్తి.. ఈ రోజు లేడంటే నమ్మలేని పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎప్పుడు ఉంటామో.. ఎప్పుడు పోతామో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే వారు సైతం సడన్ గా హార్ట్ ఎటాక్ లు, పలు కారణాలతో మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వార్త కొంత ఆనందాన్నిస్తోంది . మనిషి సగటు ఆయుర్దాయం 2015 -19 మధ్య కాలంలో రెండేళ్ళ పెరుగుదలను నమోదు చేసినట్టు తెలుస్తోంది. మనిషి జీవిత కాలం 69.7 సంవత్సరాలుగా నమోదు కానున్నట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి. సాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (Sample Registration System) నివేదిక ప్రకారం 2 ఏళ్లు ఆయుర్దాయం పెరగడానికి 10 సంవత్సరాలు పట్టిందని పేర్కొంది. కానీ ఇది అంచనా వేసిన ప్రపంచ సగటు ఆయుర్దాయం (72.6 సంవత్సరాలు) కంటే తక్కువగా ఉందని తెలిపింది.