
ఆసియా కప్ తర్వాత గ్యాప్ లేకుండా ప్రస్తుతం వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడుతూ టీమిండియా బిజీగా ఉంది. రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత నాలుగు రోజుల గ్యాప్ లోనే మళ్ళీ ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లనుంది. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో వైట్ బాల్ సిరీస్ ఆడనుంది. ఈ టూర్ లో భాగంగా ఇండియా మొదట మూడు వన్డేల సిరీస్.. ఆ తర్వాత 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. అజిత్ అగార్కర నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ శనివారం (అక్టోబర్ 4) న ప్రకటించింది. రెండు ఫార్మాట్ లలోనూ చోటు దక్కించుకున్న ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
శుభమాన్ గిల్:
టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ కు వన్డేల్లో కూడా సారధ్య బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం టీమిండియా వన్డే కెప్టెన్ గా ఉంటున్న రోహిత్ శర్మ స్థానంలో ఆస్ట్రేలియా పర్యటన నుంచి గిల్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. ఆసియా కప్ లో వైస్ కెప్టెన్ గా కొనసాగిన గిల్ ను ఆస్ట్రేలియా టీ20 స్క్వాడ్ లో వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు.
కుల్దీప్ యాదవ్:
భారత జట్టులో ప్రస్తుతం మూడు ఫార్మాట్ లలో కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ సస్పిన్నర్ అనడంలో సందేహం లేదు. ఇటీవలే ఆసియా కప్ లో తన స్పిన్ మ్యాజిక్ తో అత్యధిక వికెట్లు తీసుకున్న ఈ లెఫ్టర్మ్ స్పిన్నర్.. ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్ కు ప్రధాన స్పిన్నర్ గా ఎంపికయ్యాడు.
నితీష్ కుమార్ రెడ్డి:
ప్రస్తుతం వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడుతూ బిజీగా ఉన్న నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే, టీ20 సిరీస్ కు భారత జట్టులో ఎంపికయ్యాడు. గాయం నుంచి కోలుకున్న నితీష్ ప్రస్తుతం పూర్తి ఫిట్ గా ఉన్నాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య లేకపోవడం కూడా నితీష్ కు కలిసి వచ్చింది.
అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్:
స్పిన్ ఆల్ రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మూడు ఫార్మాట్ లలో కీలక ప్లేయర్లుగా కొనసాగుతున్నారు. వీరిద్దరూ కూడా ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే, టీ20 సిరీస్ కు టీమిండియా స్క్వాడ్ లో చోటు సంపాదించారు.
హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్
ఫాస్ట్ బౌలర్లుగా హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్ ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే, టీ20 సిరీస్ స్క్వాడ్ లో చోటు సంపాదించారు. వీరు తుది జట్టులో ఉండడం అనుమానంగా ఉన్నప్పటికీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని వీరిని బ్యాకప్ సీమర్లుగా ఎంపిక చేస్తున్నారు.
అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో సిరీస్:
2020 తర్వాత ఇండియా తొలిసారి వైట్ బాల్ ఫార్మాట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్.. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 19న పెర్త్ లో తొలి వన్డేతో టూర్ మొదలవుతుంది. అక్టోబర్ 23 న అడిలైడ్ లో రెండో వన్డే.. అక్టోబర్ 25 న సిడ్నీలో మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 29 న మనుకా ఓవల్ లో తొలి టీ20 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మెల్‌బోర్న్, హోబర్ట్, గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్ లలో వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. వన్డేలకు గిల్, టీ20లకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయనున్నారు.
►ALSO READ | IND vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఇండియా స్క్వాడ్ ప్రకటన.. అయ్యర్‌కు వైస్ కెప్టెన్సీ.. బుమ్రాకు రెస్ట్
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు భారత వన్డే జట్టు :
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ , హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ధృవ్ జురెల్, యశస్వి జైశ్వాల్
భారత టీ20 జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రానా, సంజు శాంసన్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్
🚨 India’s squad for Tour of Australia announced
— BCCI (@BCCI) October 4, 2025
Shubman Gill named #TeamIndia Captain for ODIs
The #AUSvIND bilateral series comprises three ODIs and five T20Is against Australia in October-November pic.twitter.com/l3I2LA1dBJ