ఇండియాలో 250 కి పైగా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని విమానాల తయారీ కంపెనీ ఎయిర్ బస్ హెచ్చరించింది. ఎయిర్ బస్ A320 సీరీస్ విమానాలలో సోలార్ రేడియేషన్ కారణంగా డేటాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని.. దీంతో ఫ్లైట్ కంట్రలో సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వనున్నట్లు పేర్కొంది. ఇండియాలో నడిచే ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాలలో పెద్దఎత్తున టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది ఎయిర్ బస్.
నవంబర్ ప్రారంభంలో మెక్సికో నుంచి వచ్చిన జెట్‌బ్లూ ఎయిర్‌బస్ ఏ320 విమానంలో సాంకేతిక సమస్యతో ఫ్లోరిడాలో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటనను దృష్టిలో ఉంచుకుని ఈ హెచ్చరికలు జారీ చేసింది. విమానాల్లో సాఫ్ట్ వేర్ అప్డేట్ చేసుకోవాలని.. లేదంటే అందుకు అనుకూలంగా హార్డ్ వేర్ ను మార్చుకోవాల్సి ఉంటుందని సూచించింది.
ఎయిర్ బస్ హెచ్చరికలతో ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ లో కీలకమైన ELAC యూనిట్స్ ను ఇన్ స్టాల్ చేసుకోవాల్సింది యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) ఆదేశించింది.
A320 సీరీస్ కు చెందిన 560 విమానాలను ఇండియా నడుపుతోంది. ఇందులో సగం విమానాలలో సాఫ్ట్ వేర్ ఇన్ స్టాలేషన్, హార్డ్ వేర్ మార్పులు చేయాల్సి ఉంది. అన్ని ఎయిర్ లైన్స్ లో మార్పులు చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.
ఎయిర్ బస్ సూచించిన అడ్వైజరీ ప్రకారం.. విమానాలలో కావాల్సిన మార్పులను చేయనున్నట్లు ఇండిగో పేర్కొంది. ఈ మార్పులు చేయాల్సి ఉన్నందున కొన్ని విమానాల షెడ్యూల్ మారనున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించింది.
సాప్ట్ వేర్ సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా6,500 కంటే ఎక్కువ విమానాలు ప్రభావితం కావచ్చని ఎయిర్‌బస్ తెలిపింది. ఈ అప్‌గ్రేడ్ కూడా వీలైనంత తొందరగా.. అంటే తదుపరి ప్రయాణం ప్రారంభం అయ్యేలోపే జరగాలని ఎయిర్ నోటీసులో పేర్కొంది.
