వీడియో వైరల్ : గాల్లో రాఖీ సెలబ్రేషన్స్..

వీడియో వైరల్ : గాల్లో రాఖీ సెలబ్రేషన్స్..

అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్ల మమతానురాగాలను బంధం రక్షా బంధన్ వేడుక. అటువంటి రక్షా బంధన్ వేడుక 30వేల అడుగుల ఎత్తులో గాల్లో రయ్ మంటూ దూసుకుపోతున్న విమానంలో జరిగింది. ఇండిగో ఎయిర్ లైన్స్ లో పైలట్ గా ఉన్న తన సోదరుడు గౌరవ్ కు అదే విమానంలో క్యూబిన్ క్రూ మెంబర్ గా ఉన్న శుభ రాఖీ కట్టింది.

రక్షా బంధన్ అనేది తోబుట్టువుల మధ్య ప్రత్యేకమైన బంధానికి సంబంధించిన వేడుక. ఈ శుభ సందర్భాన్ని దేశవ్యాప్తంగా చాలా ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే చాలా మంది సోదర సోదరీమణులు ఒకరికొకరు ఈ రోజు( రాఖీ పండుగ రోజు)  కలవడం కుదరకపోవచ్చు. వృత్తి పరమైన ఇబ్బందులతోపాటు అనేక కారణాల  రీత్యా తమ సోదరులను మిస్‌ అవుతూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో ఈ పండుగ రోజున అనూహ్యంగా కలుసుకొని, రాఖీ వేడుక చేసుకుంటారు. అలాంటి సంఘటన ఒకటి ఇండిగో విమానంలో చోటు చేసుకుంది.

ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాబిన్ క్రూ మెంబర్ అయిన శుభకు అలాంటి అదృష్టం వరించింది. ఇండిగో విమాన పైలట్‌గా ఉన్న తన సోదరుడు గౌరవ్‌తో కలిసి    రక్షాబంధన వేడుక జరుపుకోవడం ముచ్చటగా నిలిచింది. . 30వేల అడుగల ఎత్తున​ ఉన్నా, భూమి మీద ఉ‍న్న ఎక్కడున్నా బ్రదర్‌ అండ్‌ సిస్టం బాండింగ్‌ స్పెషల్‌ అంటూ ఈ వీడియోను ఇండిగో చేసిన ట్వీట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది

ఇండిగో విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో శుభ ప్రయాణీకులకు ఓ సందేశం ఇచ్చింది. ఫ్లైట్ ఇంటర్‌ఫోన్ సిస్టమ్‌లో అనౌన్స్‌మెంట్‌ ఇస్తు.‘‘ప్రతి సంవత్సరం పండుగలు, ప్రత్యేక క్షణాలను జరుపుకోవడం అన్ని సార్లూ సాధ్యపడదు. ముఖ్యంగా మాలాంటి ఉద్యోగులకు..ఎందుకంటే మీ ప్రియమైన వారితో కలిసి వేడుకు జరపుకునేలా మిమ్మల్ని ఇంటికి తిరిగి తీసుకెళ్లడం ముఖ్యం కాబట్టి. ఈ రోజు నాకు అన్న కెప్టెన్ గౌరవ్‌కు చాలా ప్రత్యేకమైన రోజు, చాలా ఏళ్ల తర్వాత కలిసి రక్షా బంధన్ జరుపుకుంటున్నాం.

అందరి అన్నాచెల్లెళ్లలాగానే మేమూ కొట్టుకుంటాం,తిట్టుకుంటాం,నవ్వుకుంటాం..ఏడుస్తాం... కానీ  నాకు మాత్రం నా అన్న రాక్, నా బెస్ట్ ఫ్రెండ్,  నాకు పెద్ద ఆలంబన అంటూ అంటూ శుభ సోదరుడికి రాఖీ కట్టి, అన్న ఆశీర్వాదం తీసుకోవడం విశేషంగా నిలిచింది. దీంతో ప్రయాణీకులు అందరూ ప్రయాణికులు చప్పట్లు కొట్టి వారిని అభినందించారు. 30వేల అడుగల ఎత్తున​ ఉన్నా, భూమి మీద ఉ‍న్న ఎక్కడున్నా బ్రదర్‌ అండ్‌ సిస్టం బాండింగ్‌ స్పెషల్‌ అంటూ ఈ వీడియోను ఇండిగో చేసిన ట్వీట్ చేసింది.