15 వందలు ఉన్నాయా..? విమానాన్ని గాల్లో చూసింది చాలు.. మీరూ ఎక్కే టైమొచ్చింది !

15 వందలు ఉన్నాయా..? విమానాన్ని గాల్లో చూసింది చాలు.. మీరూ ఎక్కే టైమొచ్చింది !

బడ్జెట్ ఫ్రెండ్లీ ఎయిర్ లైన్ గా పేరున్న ఎయిర్ లైన్స్లో ఇండిగో ఒకటి. ఇండిగో తాజాగా ‘మాన్సూన్ సేల్’ పేరుతో బంపర్ ఆఫర్ ప్రకటించింది. 14 వందల 99 రూపాయలకే ఫ్లైట్ టికెట్ కొనుక్కుని విమానంలో విహరించే అవకాశాన్ని తీసుకొచ్చింది. జులై 15 నుంచి జులై 18 లోపు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న కస్టమర్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అయితే.. అన్ని రూట్లకు ఈ సేల్ వర్తించదు.

ఇండిగో ప్రకటించిన సెక్టార్స్లో మాత్రమే 15 వందలకు టికెట్ కొనుక్కుని విమానం ఎక్కొచ్చు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. కడప నుంచి చెన్నైకి 14 వందల 99 రూపాయలతో ఇండిగో టికెట్ బుక్ చేసుకుని విమాన విహార అనుభూతిని ఆస్వాదించవచ్చు. కడప నుంచి విజయవాడకు కూడా 14 వందల 99 రూపాయలకే టికెట్ బుక్ చేసుకుని విమాన ప్రయాణ అనుభూతిని పొందొచ్చు.

Also Read:-అమెరికాతో భారత్ తగ్గేదేలే.. కారణం ఎందుకు అంటే ?

హైదరాబాద్ టూ విజయవాడ, హైదరాబాద్ టూ విశాఖపట్నం.. ఇలాంటి బిజీ రూట్లలో ఇండిగో ఈ ఆఫర్ను అందుబాటులో ఉంచకపోవడం గమనార్హం. వన్ వే ప్రయాణానికి మాత్రమే ఈ 1,499 రూపాయల టికెట్ వర్తిస్తుంది. కేవలం దేశీయ ప్రయాణాలపై మాత్రమే కాదు విదేశీ ప్రయాణ టికెట్లపై కూడా ఈ ‘Monsoon Sale’ను ఇండిగో ప్రకటించింది.

తమిళనాడులోని తిరుచ్చి నుంచి శ్రీలంకలోని జాఫ్నా నగరానికి 4 వేల 599 రూపాయలతో ప్రయాణం చేసే అవకాశాన్ని ఇండిగో తీసుకురావడం విశేషం. ఢిల్లీ నుంచి ఖాట్మండుకు కూడా 4 వేల 399 రూపాయలతో టికెట్ కొనుక్కుని ఇండిగో విమానంలో ప్రయాణం చేయవచ్చు. జులై 22, 2025 నుంచి సెప్టెంబర్ 21, 2025 లోపు ప్రయాణం చేసే వారికి మాత్రమే ఈ ‘మాన్సూన్ సేల్’ ఆఫర్ వర్తిస్తుంది.