ఇండిగో లాభం రూ. 919 కోట్లు

ఇండిగో లాభం రూ. 919 కోట్లు

న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్​లైన్స్​ను నడిపే ఇంటర్​ గ్లోబ్​ ఏవియేషన్ మార్చి 2023 తో ముగిసిన క్యూ4 లో రూ. 919.20 కోట్ల నికర లాభం సంపాదించింది. అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్లో కంపెనీకి రూ. 1,681.80 కోట్ల  నికర నష్టం వచ్చింది.

జూన్​ క్వార్టర్లో ఎవైలబుల్​ సీట్​ కిలోమీటర్స్​ (ఏఎస్​కే) 5 నుంచి 7 శాతం పెరుగుతుందని అంచనాలను వెల్లడించింది. ఏఎస్​కే సీట్​ కెపాసిటీని తెలియచేస్తుంది. తాజా  నాలుగో క్వార్టర్​కు కంపెనీ బెస్ట్​ ఎవర్ ​నెట్​ ప్రాఫిట్​ప్రకటించింది.