ఇండిగో ప్రాఫిట్ డబుల్‌‌

ఇండిగో ప్రాఫిట్ డబుల్‌‌

 న్యూఢిల్లీ :  ఇండిగో విమానాలను ఆపరేట్ చేసే ఇంటర్‌‌‌‌ గ్లోబల్‌‌ ఏవియేషన్‌‌కు డిసెంబర్‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌ (క్యూ3) లో రూ. 2,998 కోట్ల నికర లాభం (స్టాండ్‌‌ఎలోన్‌‌) వచ్చింది. అంతకు ముందు ఏడాది క్యూ3 లో వచ్చిన రూ.1,418 కోట్లతో పోలిస్తే రెండింతలు పెరిగింది. ఫెస్టివ్ సీజన్‌‌, వెడ్డింగ్ సీజన్‌‌  వలన కంపెనీ బాగా లాభపడింది. అంతేకాకుండా క్రికెట్ వరల్డ్‌‌ కప్‌‌ కూడా కిందటేడాది  డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లోనే జరిగింది. దీంతో ఇండిగో సేల్స్ పెరిగాయి. కంపెనీ రెవెన్యూ   ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 30 శాతం పెరిగి క్యూ3 లో  రూ.19,452 కోట్లకు ఎగసింది.  టికెట్‌‌ రేట్లు పెరగడంతో రెవెన్యూ కూడా పెరిగింది.  ఫ్యూయల్ ధరలు, డాలర్ మారకంలో రూపాయి విలువ  పెరగడంతో కంపెనీ ఖర్చులు కూడా 22 శాతం పెరిగాయి.