
న్యూఢిల్లీ: ఇండిగో ప్రమోటర్ రాకేష్ గంగ్వాల్, ఆయన కుటుంబ ట్రస్ట్ కంపెనీలో 3.1శాతం వాటాను రూ. 7,027.7 కోట్లకు విక్రయించారు. ఈ బ్లాక్ డీల్స్‌తో ఈ ఎయిర్‌లైన్ కంపెనీ షేర్లు గురువారం 4.44శాతం తగ్గి రూ.5,781కి పడ్డాయి. ఈ ఏడాది జూన్ క్వార్టర్ నాటికి, గంగ్వాల్ కుటుంబానికి 7.81శాతం వాటా ఉండగా, తాజా సేల్‌తో ఇది 4.71 శాతానికి తగ్గింది. ఈ బ్లాక్ డీల్‌లో 1.21 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఫ్లోర్ ప్రైస్ రూ.5,808. ఇది గత ముగింపు ధర రూ.6,050 కంటే 4శాతం తక్కువ.
ఈ షేర్లను ఎవరు కొన్నారో వివరాలు బయటపడలేదు. ఇండిగో కో–ఫౌండర్ రాహుల్ భాటియాతో 2022లో విభేదాలు నెలకొనడంతో , రాకేష్ గంగ్వాల్ తన వాటాను దశలవారీగా తగ్గించుకుంటూ వస్తున్నారు. 2022 నుంచి ఇప్పటివరకు ఆయన కుటుంబం రూ.28 వేల కోట్లకు పైగా విలువైన షేర్లను అమ్మింది.