జన్నారం/జైపూర్/చెన్నూరు, వెలుగు: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం ఇందిరా మహిళా శక్తి చీరాలను మహిళా సమాఖ్య సభ్యులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకరావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో భాగంగా వడ్డిలేని రుణాలు అందజేస్తోందని, మహిళల కోసం ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించిందని తెలిపారు.
కార్యక్రమంలో అడిషనల్ పీడీ అంజయ్య, ఐకేపీ ఏపీఎం లలిత కుమారి, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ సయ్యద్ ఫసిఉల్లా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యం సతీశ్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మాణిక్యం, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
జైపూర్, భీమారం మండలాల్లో..
జైపూర్, భీమారం మండలాల్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీని డీఆర్డీవో కిషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల ఆర్థిక, -సామాజికాభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తోందన్నారు. తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీఓలు సత్యనారాయణ, మధుసూదన్, డీటీ అంజమ్మ, కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి,పార్టీ మండల ప్రెసిడెంట్, లీడర్లు మహిళా సంఘం అధ్యక్షురాళ్లు పాల్గొన్నారు.
చెన్నూర్ మండలంలో..
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ చీరాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చెన్నూరు మండలంలో కాంగ్రెస్ నాయకులు చీరలను పంపిణీ చేశారు. మండలంలోని కొమ్మెర, పొక్కూర్, అస్నాద్, బీరెల్లి, సోమన్ పల్లి, సుద్దాల, బావురవుపేట, లంబడి పల్లె, కాచన్ పెల్లి గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు తహసీల్దార్ మల్లికార్జున్‌తో కలిసి స్థానిక కాంగ్రెస్ నాయకులు చీరలు అందజేశారు.
