- హౌసింగ్ సెక్రటరీ వీపీ గౌతమ్
కొడంగల్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనా ఆర్థిక ఇబ్బందుల కారణంగా కట్టుకోలేకపోతున్న వారికి మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా లోన్లు ఇవ్వాలని హౌసింగ్సెక్రటరీ వీపీ గౌతమ్ సంబంధింత అధికారులను ఆదేశించారు.
వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలం మెట్లకుంటలో సెకండ్ఫేజ్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను గురువారం ఆయన పరిశీలించారు. ఇండ్లు మంజూరైనా నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల గురించి ఆరా తీశారు. ఆర్థిక ఇబ్బందులు, కూలీలు, ఇసుక కొరత, ఎస్టిమేషన్పెరగడం వల్ల ఇండ్ల నిర్మాణం చేపట్టలేదని ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ సమస్యను వివరించారు.
దీంతో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు లోన్లు మంజూరు చేయాలని ఎంపీడీవో వెంకన్నగౌడ్ను ఆదేశించారు. స్కీల్డ్లేబర్లను వినియోగించడం ద్వారా వ్యయం తగ్గించుకోవచ్చని సూచించారు. ఇంటి నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ సుధీర్, ట్రైనీ కలెక్టర్హర్ష్చౌదరి, లైబరీ చైర్మన్రాజేశ్రెడ్డి ఉన్నారు.
