
హైదరాబాద్, వెలుగు: దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బీ2బీ ఇండస్ట్రీయల్ మెషినరీ, ఇంజనీరింగ్ ఎక్స్‌పో హైదరాబాద్‌లోని హైటెక్స్ లో ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్ ఈనెల 25వ తేదీ వరకు జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఉచిత ప్రవేశం ఉంటుందని ఇండోమాక్ తెలిపింది.
గతంలో 2022, 2023, 2024 సంవత్సరాలలో నిర్వహించిన మూడు ఎడిషన్లు అనూహ్య విజయాన్ని సాధించాయని పేర్కొంది. మెషిన్ టూల్స్, ఆటోమేషన్, రోబోటిక్స్, ఫ్లాట్, ఎలక్ట్రికల్, ఇండస్ట్రియల్, ఇంజినీరింగ్ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. వీటిలో కొన్ని భారత్‌లో మొదటిసారిగా పరిచయం అవుతున్నాయని ఇండోమాక్ తెలిపింది.