16 ఏళ్లకే మలేషియా యువరాజుతో పెళ్లి.. ఆ తర్వాత ఎస్కేప్.. 17 ఏళ్ల తర్వాత నోరువిప్పిన ఇండోనేషియన్ మోడల్

16 ఏళ్లకే మలేషియా యువరాజుతో పెళ్లి.. ఆ తర్వాత ఎస్కేప్.. 17 ఏళ్ల తర్వాత నోరువిప్పిన ఇండోనేషియన్ మోడల్

ప్రపంచం అంతా ప్రజాస్వామ్యం, సామ్యవాద భావనతో ప్రభుత్వాలు నడుస్తుంటే.. ఇంకా కొన్ని దేశాల్లో అక్కడక్కడా రాచరిక పాలన కొనసాగుతోంది. గ్లోబలైజేషన్ భావనను అందిపుచ్చుకుంటూనే రాచరికాన్ని కొనసాగిస్తున్నాయి. అలాంటి దేశాలలో ఒకటైన మలేషియాలో.. 2008లో జరిగిన యువరాజు చట్టవిరుద్ధమైన పెళ్లి.. ప్రపంచ వ్యాప్తంగా వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఇండోనేషియాకు చెందిన మోడల్, యువరాణి.. అంత:పుర వేధింపులు తాళలేక పారిపోయిన ఘటన అప్పుడప్పుడు వార్తల్లోకి వస్తూనే ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ పై తొలిసారి.. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఓపెన్ అప్ అయింది ఇండోనేషియన్–అమెరికన్ మోడల్ మనోహర ఓదేలియా.

2008లో మలేషియా ప్రిన్స్ తెంగ్కూ ఫఖ్రీ.. మోడల్ అయిన మనోహర ఒదేలియాను వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమే. యువరాజు లైంగిక వేధింపులు, ఫిజికల్ టార్చర్ కు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఏడాది తర్వాత ఆమె సినీ ఫక్కీలో.. చాలా భయంకర పరిస్థితుల్లో ఎస్కేప్ అయింది. 

ఈ పెళ్లి గురించి తొలిసారిగా ఆమె ఓపెన్ అప్ అయింది. అది బలవంతపు పెళ్లి.. చట్ట విరుద్ధం.. అంటూ కామెంట్స్ చేసింది. అదే క్రమంలో తనను మలేషియా యువరాజు మాజీ భార్య అంటూ మీడియా సంబోధించడాన్ని తప్పు పట్టింది. 

Also Read : బాడీ ఇటు కాళ్లు అటు.. కిచెన్ ఫ్యాన్ రంధ్రంలో ఇరుక్కుని నరకం చూసిన దొంగ

మోడల్ మనోహరకు ప్రస్తుతం 33 ఏళ్లు. ఆ పెళ్లి గురించి మాట్లాడుతూ.. అది సమ్మతంతో చేసుకున్న పెళ్లి కాదు.. చట్టబద్ధమైనదీ కాదు.. అది ఒక బలవంతపు పెళ్లి అని ఆమె మీడియాతో తెలిపింది. అప్పుడు తను మైనర్ అయినందున పెళ్లికి సమ్మతించాలో వద్దో.. అడ్డుచెప్పాలో.. ఒంటరిగా ఉండాలా అనే నిర్ణయం తీసుకునే తెలివి తనకు లేదని చెప్పింది. 

గూగుల్, వికీపీడియాకు సుతిమెత్తని వార్నింగ్:

ఈ సందర్భంగా గూగుల్, వికీపీడియా వంటి డిజిటల్ ప్లాట్ ఫామ్స్, జర్నలిస్టులకు సుతిమెత్తని వార్నింగ్ ఇచ్చింది మనోహర ఒదేలియా. బాల్య వివాహాలకు సంబంధించిన ఘటనలపై రాసేటప్పుడు నైతికమైన, ఖచ్చితమైన పదాలను, భాషను వాడాలని సూచించింది. లేదంటే అది అవమానించినట్లేనని తెలిపింది. 

ఏడాది పాటు అంత:పురంలో నరకం:

మలేషియాలోని కెలంతన్ రాయల్ ప్యాలస్ లో ఏడాది పాటు నరకం అనుభవించినట్లు మోడల్ చెప్పింది. అంత:పురంలో ఒంటరిగా.. ఘోరమైన నిఘాతో, ఫిజికల్, సెక్సువల్ అబ్యూస్ (శారీరక, లైంగిక వేధింపులతో) టార్చర్ చేసినట్లు పేర్కొంది. దీంతో 2009లో సింగపూర్ హోటల్ నుంచి నాటకీయ పరిణామాల మధ్య పారిపోయినట్లు తెలిపింది. 

టీనేజ్ వయసులో.. ఆ పెళ్లిలో తనకున్నది రొమాంటిక్ రిలేషన్‌షిప్ కాదు.. అంగీకార యోగ్యమైన సంబంధం కాదు. చట్టబద్ధమైన పెళ్లి కూడా కాదు. నేనెప్పుడు ఆ బంధాన్ని, పెళ్లిని కోరుకోలేదు. మైనర్ కావడం.. స్వేచ్ఛ లేకపోవడంతో బలవంతం ఇరుక్కుపోయినట్లు ఆమె చెప్పింది. 

Also Read : ఇదెక్కడి వారసత్వ పిచ్చిరా బాబూ.. కొడుకు కోసం ఆరాటం.. 11వ కాన్పులో పుట్టిన మగబిడ్డ !

మలేషియా కెలాంతన్ రాష్ట్రానికి రాజు లేదా సుల్తాన్ కొడుకు తెంగ్కూ మొహమ్మద్ ఫక్రీ పెట్రా. 2008లో ఇండోనేషియన్ మోడల్ మనోహర ఒదేలియా పినోత్ ను వివాహం చేసుకున్నాడు. 16 ఏళ్లకే జరిగిన పెళ్లి ఆ తర్వాత చాలా వివాదాస్పదంగా మారింది. భౌతిక, లైందిగ వేధింపులకు గురిచేసినట్లు ఆమె చెప్పింది. 2009లో.. సింగపూర్ లోని హోటల్ నుంచి.. ఆమె తల్లి, స్థానిక పోలీసులు, అమెరికా దౌత్య కార్యాలయం అధికారుల సాయంతో ఇండోనేషియా పారిపోయింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ ఘటనపై ఆమె నోరు విప్పడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.