కూలిపోయిన ఇండోర్ స్టేడియం.. చిక్కుకున్న 14 మంది కూలీలు.. ఇద్దరు మృతి

కూలిపోయిన ఇండోర్ స్టేడియం.. చిక్కుకున్న 14 మంది కూలీలు.. ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడిలో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం గోడ కూలిపోయింది. నిర్మాణ పనులు చేస్తున్న 14 మంది కూలీలు గోడ కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో 12 మందిని బయటకు తీశారు. 

కాగా ఈ ప్రమాదంలో ఇద్దరి కూలీలు మృతి చెందినట్లు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.