
చెన్నైలో ఇండియాతో జరుగుతోన్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఇప్పటికే రెండు వన్డేల్లో చెరో ఒకటి గెలిచిన ఇరు జట్లు ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నాయి. టీమిండియాలో పెద్దగా మార్పులేమి లేవు. ఆస్ట్రేలియా టీంలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అలాగే స్పిన్నర్ ఆస్టన్ ఆగర్ ను తీసుకున్నారు.