న్యాల్కల్, వెలుగు: శిశువును ముళ్లపొదల్లో వదిలేసి వెళ్లగా, ఓ తల్లి పసికందును కాపాడింది. వివరాలిలా ఉన్నాయి.. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ పీహెచ్సీ వెనుక భాగంలోని ముళ్ల పొదల్లో మంగళవారం ఉదయం నవజాత శిశువును వదిలేసి వెళ్లగా, బుడగజంగాల గూడెంకు చెందిన ఓ మహిళ అటు వైపు వెళ్లగా పసికందు ఏడుపు వినిపించింది.
ఆ బిడ్డను ఇంటికి తీసుకెళ్లి శుభ్రం చేసి సంరక్షించింది. స్థానికులు పోలీసులు, డాక్టర్లకు సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకొని శిశువు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. 108లో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మగ శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యాధికారి అమృత్‌రాజ్ తెలిపారు.
