కరోనా సోకిందని నిండు గర్భిణిని హాస్పిటల్​లో చేర్చుకోలే

కరోనా సోకిందని నిండు గర్భిణిని హాస్పిటల్​లో చేర్చుకోలే

ములకలపల్లి, వెలుగు: కడుపులో బిడ్డ అప్పటికే మృతి చెందింది. కరోనా సోకిందని ఆపరేషన్ ​చేయకుండా బయటకు పంపించేయడం, ఏ హాస్పిటల్​లోనూ చేర్చుకోకపోవడంతో గర్భిణి సైతం చనిపోయింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతాయిగూడెం పంచాయతీ వార్డు మెంబర్​సోయం ప్రసాద్ భార్య సుజాత(28)కు నెలలు నిండడంతో శనివారం సత్తుపల్లిలోని ప్రైవేటు దవాఖానాకు తీసుకువెళ్లారు. సుజాతను పరీక్షించిన డాక్టర్లు కడుపులోని శిశువు చనిపోయిందని, మెరుగైన వైద్యం అందించాలని చెప్పడంతో కుటుంబసభ్యులు  ఖమ్మంలోని ప్రైవేట్​దవాఖానలో చేర్చారు. 24 గంటలు అక్కడ ఉంచుకున్న డాక్టర్లు కరోనా సోకిందని చెప్పి ఆపరేషన్​చేయకుండా సుజాతను బయటకు పంపేశారు. దీంతో భర్త ప్రసాద్ ఖమ్మంలోనే పలు దవాఖానలకు తీసుకువెళ్లినప్పటికీ ఎవరూ చేర్చుకోలేదు. పరిస్థితి విషమించి ఖమ్మంలోనే రోడ్డుపై సుజాత మృతి చెందింది. రూ.లక్ష కట్టించుకుని ఆపరేషన్​ చేయకుండా బయటకు పంపడం వల్లే తన భార్య మృతి చెందిందని ప్రసాద్​ వాపోయాడు. మృతురాలికి ఏడాది పాప ఉంది.