16 జీబీ ర్యామ్​తో ఇన్ఫినిక్స్ ​జీరో బుక్​ అల్ట్రా

16 జీబీ ర్యామ్​తో ఇన్ఫినిక్స్ ​జీరో బుక్​ అల్ట్రా

ఎలక్ట్రానిక్స్​ కంపెనీ ఇన్ఫినిక్స్​ శనివారం భారతదేశంలో జీరో బుక్​అల్ట్రా ల్యాప్​టాప్​ను విడుదల చేసింది.  ఇందులో పలు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఫీచర్లు ఉంటాయి.  ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అమర్చారు. విండోస్​ 11 ఓఎస్​తో నడుస్తుంది. ఇందులో15.6- అంగుళాల డిస్​ప్లే, 16 జీబీ ర్యామ్​, టైప్​సీ పోర్ట్​, 100 వాట్ల చార్జర్​, భారీ బ్యాటరీ ఉంటాయి.   ధరలు రూ.59,990 నుంచి మొదలవుతాయి. ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్​లో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఉపయోగించి చేసే కొనుగోళ్లపై 2,000 తగ్గింపు ఉంటుంది.