వడ్డీ రేట్ల తగ్గింపు .. ఇన్​ఫ్లేషన్​ తగ్గాకనే

వడ్డీ రేట్ల తగ్గింపు .. ఇన్​ఫ్లేషన్​ తగ్గాకనే

న్యూఢిల్లీ: ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ ఇంకా తగ్గలేదని,  పాలసీలో మార్పులు చేయడం తొందర పాటు చర్య అవుతుందని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. మానిటరీ పాలసీని మారిస్తే ఇప్పటి వరకు సాధించిందంతా వృధా అవుతుందని అన్నారు.   తాజా ఎంపీసీ మీటింగ్ మినిట్స్‌‌‌‌‌‌‌‌ను గురువారం విడుదల చేశారు. ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ను తగ్గించే పని పూర్తయ్యిందని అనుకోకూడదని చెప్పారు. ధరలు తగ్గించడంపై  కట్టుబడి ఉన్నామని అన్నారు. 

ఈ నెల ప్రారంభంలో జరిగిన ఎంపీసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లోనూ దాస్ ఇలాంటి కామెంట్సే చేశారు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఎంపీసీ రెపో రేటును 6.5 శాతం దగ్గర కొనసాగిస్తోంది. రిటైల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ను 4 శాతం దిగువకు తీసుకురావాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది. ఈ ఏడాది జనవరిలో రిటైల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ 5.10 శాతంగా రికార్డయ్యింది.