
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నిండుకుండల్లా ఉన్న ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరీవాహక ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కురిసిన వర్షాలకు ఆయా జలాశయాల్లోకి వరద నీరు చేరుతోంది. దీంతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు సంబంధించి ఒక్కో గేటును ఒక అడుగు పైకి ఎత్తారు.
ప్రస్తుతం ఉస్మాన్ సాగర్‌లోకి 150 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, ఔట్‌ఫ్లో 120 క్యూసెక్కులు వుంది. హిమాయత్ సాగర్‌లోకి 300 క్యూసెక్కులు ఇన్ఫ్లో, 340 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. ఉస్మాన్‌సాగర్ ఫుల్ట్యాంక్ లెవల్ 1,790 అడుగులు కాగా ప్రస్తుతం 1,789.90 అడుగుల నీరు చేరింది. హిమాయత్‌సాగర్ ఫుల్ట్యాంక్ లెవెల్ 1,763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1,763.50 అడుగులు నీటి నిల్వ ఉంది.