చెన్నూరులో రిపబ్లిక్ డే వేడుకలు..జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి వివేక్

చెన్నూరులో రిపబ్లిక్ డే వేడుకలు..జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి వివేక్

 దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.  తెలంగాణలోనూ రాష్ట్ర వ్యాప్తంగా  ప్రభుత్వ, ప్రైవేట్  కార్యాలయాలు,  పార్టీ ఆఫీసులు, స్కూళ్లలో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది.

 మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.  ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో జాతీయ జెండా ఎగుర వేశారు  కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.  ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్   ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రూపొందింరచారని మంత్రి వివేక్ అన్నారు. దేశంలో కుల మతాలకు అతీతంగా అందరూ సమానంగా ఉండాలని రాజ్యాంగం రచించారని చెప్పారు. దేశంలో  గరీబీ హటావో అనే కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ రూపొందించారని అన్నారు. ప్రపంచంలోనే భారత దేశాన్ని  మూడో అతి పెద్ద ఆర్థిక రంగ వ్యవస్థగా రూపుదిద్దుకున్నామని తెలిపారు. ప్రజలందరూ కష్టపడి దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి వివేక్.