ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లుయెంజా  ఇలా దూరం

ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లుయెంజా  ఇలా దూరం

కొన్నిరోజులుగా జలుబు, దగ్గు, జ్వరాల గురించిన వార్తలు ఎక్కువై పోయాయి. ఎండాకాలం మొదలవుతున్న టైంలో ఫ్లూ జ్వరాలు తెగ భయపెడుతున్నాయి. రెండు వారాలైనా దగ్గు తగ్గకపోవడంతో చాలామంది కొవిడ్ అని భయపడుతున్నారు. కానీ, ఈ లక్షణాలు  హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌3ఎన్2(H3N2) వైరస్ కారణంగా వచ్చే ఫ్లూ జ్వరానివి అని ప్రభుత్వం చెప్తోంది. అసలేంటీ  వైరస్? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ విషయాల గురించి డాక్టర్ ప్రశాంత్ చంద్ర వివరంగా చెప్పారు.


రీసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వస్తున్న దగ్గు, జ్వరాల కేసులకు హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌3ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2 అనే వైరస్ కారణం అని ప్రభుత్వం చెప్తోంది. ఇదొక రకమైన ఫ్లూ వైరస్. దీన్నే ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లుయెంజా అని కూడా అంటారు. ఇలాంటి ఫ్లూ వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు జంతువులు, పక్షుల నుంచి కూడా సోకుతాయి. వాతావరణంలో మార్పులు వచ్చేటప్పుడు వీటి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.


మ్యుటేషన్ చెంది..


సమ్మర్ మొదలయ్యేటప్పుడు ఇలాంటి ఫ్లూ జ్వరాలు రావడం మామూలే. ఈ రకమైన ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లుయెంజా వైరస్ గతంలో కూడా ఉంది. అయితే ఏటా ఈ వైరస్ మ్యుటేషన్ చెందుతూ వస్తోంది. గతంలో వచ్చిన ‘హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1ఎన్1’ వైరస్.. ఇప్పుడు ‘హెచ్3ఎన్2’గా మ్యుటేషన్ చెందింది. ఈ వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కారణంగా వచ్చే దగ్గు కనీసం మూడు వారాలు ఉంటుంది. ఈ రకమైన వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. అయితే వైరస్ ఏటా మ్యుటేషన్ చెందడం వల్ల ప్రతిఏటా కొత్త వెర్షన్ వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుంటుంది. అయితే  గ్యాప్ లేకుండా వస్తున్న దగ్గుని చూసి చాలామంది కొవిడ్ అని భయపడుతున్నారు. ఇది కొవిడ్ కాదని అందరూ తెలుసుకోవాలి. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లుయెంజా లక్షణాలు కూడా కొవిడ్ లక్షణాలకు దగ్గరగా ఉంటాయి. కానీ, ఇది కొవిడ్ అంత ప్రమాదకరమైంది కాదు. 


జాగ్రత్తలు ఇలా..


కొవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరహాలోనే ఈ వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇంట్లో ఒకరికి వస్తే మిగతావాళ్లకీ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోకకూడదు అనుకుంటే చేతులను తరచూ కడుక్కోవడం, మాస్క్ పెట్టుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నోరు, ముక్కు పదే పదే తాకొద్దు. కలిసి తినడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం వంటివి చేయొద్దు. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లు, న్యుమోనియా లేదా ఇతర శ్వాసకోశ సమస్యలున్న వాళ్లకు ఫ్లూతో రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్లు ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరింత జాగ్రత్తగా ఉండాలి. 


ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లుయెంజా వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు బయటకు వెళ్లకుండా, ఇంట్లో మనుషులకు కూడా కాస్త దూరంగా ఉండాలి. మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకోవడం తప్పనిసరి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇతరులకు వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోకకుండా ఉంటుంది. అలాగే తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వైరస్ ఇతరులకు సోకకుండా నోటిని, ముక్కుని కవర్ చేసుకోవాలి. జలుబు, దగ్గు మాత్రమే ఉంటే రెండు మూడు రోజులు వెయిట్​ చేయొచ్చు. కానీ, విపరీతమైన జ్వరం, విరేచనాలు  కూడా మొదలైతే డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ జ్వరం నార్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటే పారాసెటమాల్ వేసుకోవచ్చు. అప్పటికీ తగ్గకపోతే  డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలవాలి. 


వీటితోపాటు జలుబు, దగ్గు మొదలైనప్పుడు సమ్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని ఫుడ్ తీసుకోవాలి. తేలికగా అరిగేవి తినాలి. శరీరాన్ని ఎప్పుడూ  హైడ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంచుకోవాలి. లిక్విడ్స్ ఎక్కువగా తాగాలి. చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి. చల్లని నీళ్లకు బదులుగా వేడినీళ్లు తాగుతుంటే గొంతులో రిలీఫ్ అనిపిస్తుంది. ఇలాంటి వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు లక్షణాలను బట్టి డాక్టర్లు ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ చేస్తారు. కాబట్టి యాంటీబయాటిక్స్, సొంత ట్రీట్​మెంట్స్​ లాంటివి వద్దే వద్దు.

లక్షణాలు ఇవి.. 


ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతో కూడిన సీజనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జ్వరాలు మామూలే. సాధారణ జ్వరం అయితే మూడు నుంచి ఐదు  రోజుల్లో తగ్గిపోతుంది. తగ్గకపోతే టెస్ట్ చేయించుకోవాలి. ఇక హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌3ఎన్2 విషయానికొస్తే.. ఈ- వైరస్  కొవిడ్ లాగానే లంగ్ ఇన్ఫెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలిగిస్తుంది. ఈ వైరస్ సోకినప్పుడు జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, తుమ్ములు, తలనొప్పి, ముక్కు కారడం, అలసట, విరేచనాలు, ఊపిరి సరిగా ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇప్పుడు హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వస్తున్నవాళ్లలో వారం రోజులైనా దగ్గు తగ్గని వాళ్లు ఎక్కువ ఉంటున్నారు. కాబట్టి ఎక్కువ రోజుల పాటు దగ్గు వస్తుంటే అది ఫ్లూ లక్షణం అనుకోవచ్చు. ఇలా ఆగకుండా దగ్గు వస్తున్నా లేదా జ్వరం ఎక్కువగా ఉండి రెండు మూడు రోజులైనా తగ్గకపోతుంటే లేట్ చేయకుండా డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలవాలి.