
నాన్న పులి కథ తెలుసు కదా.. సరదాగా పులి పులి అని అరుస్తాడు కొడుకు.. అది నమ్మి వచ్చిన నాన్నకు అది కామెడీ అని తెలుస్తుంది.. ఆ తర్వాత నిజంగా పులి వస్తుంది.. ఆ నాన్న కామెడీ అనుకుంటాడు.. ఆ తర్వాత ఆ పులి ఆ కొడుకునే తినేస్తుంది.. ఇప్పుడు AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు ఇలాగే తయారయ్యాయి.. ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియని గందరగోళంలో పడుతున్నారు జనం.. దీనికి ఎగ్జాంపుల్ ముంబై మహానగరంలోని ఇన్సిడెంట్..
ముంబై సిటీలో ఫేమస్ మాల్ ఫీనిక్స్.. ఈ మాల్ లో పెద్ద పులి తిరుగుతుంది.. మాల్ లోకి పులి వచ్చింది అని ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ఆ వీడియో మాల్ లో పులి తిరుగుతున్నట్లు.. దాన్ని సెక్యూరిటీ సిబ్బంది తరుముతున్నట్లు ఉంటుంది. మాల్ లో పెద్ద పులి అటూ ఇటూ తిరుగుతున్నట్లు.. పరిగెడుతున్నట్లు ఉంటుంది.. అంతేనా ఆ పులి జనంపై దాడి చేస్తున్నట్లు ఉంది ఈ వీడియో.. ఇది ఇన్ స్ట్రాలో పోస్ట్ అయ్యింది. అంతే నిమిషాల్లోనే వైరల్.. ముంబై సిటీ జనం అవాక్కయ్యారు.. సిటీ నడిబొడ్డున ఉన్న ఇంత పెద్ద మాల్ లోకి పులి ఎలా వచ్చింది అనే డౌట్ కంటే.. మాల్ లో పులి హడావిడి చూసి భయపడ్డారు.
ALSO READ : హైదరాబాద్ మెట్రో విస్తరణపై కమిటీ..
ఇక ఈ వీడియో అటూ ఇటూ తిరిగి మాల్ యాజమాన్యం వరకు వెళ్లింది. వాళ్లు షాక్.. మా షాపింగ్ మాల్ లో పులి ఏంటీ.. మాకే తెలియకుండా ఎలా వచ్చింది అని తలలు పట్టుకున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటీ అంటే.. ఇది AI వీడియో.. ఆర్టిఫిషియల్ గా తయారు చేసి రిలీజ్ చేసిన వీడియో.. నిజం లెక్కనే ఉంది. ఓ షాపింగ్ మాల్ లోకి పులి వస్తే ఎలాంటి గందరగోళానికి గురవుతుంది.. ఎలా ప్రవర్తిస్తుంది.. మాల్ లోని కస్టమర్లు, సిబ్బంది ఎలా ప్రవర్తిస్తారు అనేది ఈ AI వీడియోలో ఉంది. నిజమైన వీడియో మాదిరిగానే ఉండటంతో.. వేల సంఖ్యలో షేర్స్ అయ్యాయి.. 24 గంటల్లోనే 50 వేల మంది ముంబై సిటీ నెటిజన్లు లైక్ చేయగా.. వేల మంది నెటిజన్లు దీనిపై ఆరా తీయటం విశేషం.
ముంబై సిటీలోని మాల్ లో పెద్ద పులి అనేది AI వీడియో అని.. ఎవరూ నమ్మొద్దని మాల్ యాజమాన్యం ప్రకటించింది. మొత్తానికి AI ఇప్పుడు అబద్దాన్ని నిజం చేసేస్తుంది.. నిజాన్ని అబద్దంగా మార్చేస్తుంది.. ఈ రెండూ లేకుండానే లేనిది ఉన్నట్లు సృష్టించి గందరగోళం సృష్టిస్తుంది అనటానికే ఇదో ఎగ్జాంపుల్..