‘తెలుసు కదా’కి పాజిటివ్ టాక్: ఎట్టకేలకు హిట్ కొట్టిన సిద్ధు.. అక్కా భలే తీసిందంటూ ఆడియన్స్ కామెంట్స్!

‘తెలుసు కదా’కి పాజిటివ్ టాక్: ఎట్టకేలకు హిట్ కొట్టిన సిద్ధు.. అక్కా భలే తీసిందంటూ ఆడియన్స్ కామెంట్స్!

‘తెలుసు కదా’ చిత్రంలో తాను పోషించిన వరుణ్ పాత్ర ఒక్క చుక్క రక్తం చిందించకుండా ఎమోషనల్ వార్, సైకలాజికల్ వైలెన్స్‌‌ని జనరేట్ చేస్తుందని సిద్ధు జొన్నలగడ్డ ప్రమోషనల్ ఈవెంట్స్లో చెప్పుకొచ్చాడు. నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నేడు అక్టోబర్ 17న విడుదలైంది. ఈ క్రమంలో మూవీ చూసిన ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ట్రై యాంగిల్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. రొమాంటిక్ ఎమోషనల్ కామెడీతో ప్రేక్షకులను సిద్ధు ఎంటర్‌టైనింగ్ చేశారని ఆడియన్స్ అంటున్నారు. సిద్ధు కెరీర్‌లో బెస్ట్ ఫర్ఫార్మన్స్ ఇచ్చాడని, ఇందులో వైవా హర్ష కామెడీ బాగుందని పోస్టులు పెడుతున్నారు. నీరజ కోన డైరెక్షన్ బాగుందని, తన మొదటి సినిమాతోనే అక్కా హిట్ కొట్టిందని ఆడియన్స్ అంటున్నారు. 

చివరగా.. టిల్లు, టిల్లు స్క్వేర్ వంటి హిట్ మూవీస్ తర్వాత, జాక్తో డిజాస్టర్ అయిన సిద్ధుకి.. ‘తెలుసు కదా’ మంచి కంబ్యాక్ ఇచ్చిందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక తొలి టాక్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. దీపావళి బరిలో సత్తా చాటే ఛాన్సెస్ బలంగా ఉన్నాయి. ఈ వీకెండ్ ఇలానే టాక్ కొనసాగితే.. సిద్దు విజయాన్ని ఎవ్వరు ఆపలేరని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. 

‘తెలుసు కదా’ మూవీ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌‌ ఈవెంట్‌‌లో సిద్ధు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ఒక ఏడాదిగా చాలా రాడికల్ అండ్ ఇంటరెస్టింగ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నా. ఒక వింత మనిషి బుర్రలో బతుకుతున్నా. ఇప్పుడు సినిమా విడుదలై వరుణ్ అనే క్యారెక్టర్‌‌‌‌కి గుడ్ బై చెప్పేయాలి. 

ఇందులో నాది వెరీ ఇంటరెస్టింగ్‌‌ క్యారెక్టర్. అబ్బాయిలకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరెస్టు స్థాయిలో ఉండాలి. మన ఎమోషన్స్ మన కంట్రోల్‌‌లో ఉండాలని తెలియజేసేలా సినిమా ఉంటుంది’ అని చెప్పాడు.

ఇందులోని తమ పాత్రలు ఆకట్టుకుంటాయని హీరోయిన్స్ శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా అన్నారు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో సిద్ధు, శ్రీనిధి, రాశీ ఖన్నా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారని డైరెక్టర్ నీరజ కోన చెప్పారు.

ఇది చాలా స్పెషల్ ఫిల్మ్ అని, ఆడియెన్స్ తప్పకుండా కనెక్ట్ అవుతారని నిర్మాత కృతి ప్రసాద్ అన్నారు.  నటుడు  వైవా హర్ష,  లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్,  డిఓపి జ్ఞాన శేఖర్ పాల్గొన్నారు.