
ప్రదీప్ రంగనాథన్, మమిత బైజూ జంటగా కీర్తిశ్వరన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం ‘డ్యూడ్’. శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదలైంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథులుగా హాజరైన దర్శకులు హను రాఘవపూడి, బుచ్చిబాబు సాన, రాహుల్ సాంకృత్యన్, శివ నిర్వాణ, సాయి రాజేష్, పి మహేష్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.
ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ ‘ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. నేను నటించిన లవ్ టుడే, డ్రాగన్ నచ్చినట్లయితే ఈ మూవీ కూడా కచ్చితంగా నచ్చుతుంది. తెలుగులో నాకు ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవ్వాలని ఉంటుంది’ అని చెప్పాడు.
ప్రదీప్‌తో నటించడం మంచి ఎక్స్‌పీరియెన్స్ అని మమిత బైజు చెప్పింది. అల్లు అర్జున్ ‘ఆర్య’ సినిమా.. ఈ డ్యూడ్ స్క్రిప్ట్ చేయడానికి ఇన్‌స్పిరేషన్ అని చిత్ర దర్శకుడు కీర్తిశ్వరన్ అన్నాడు.
ఈ బ్యూటిఫుల్ లవ్‌స్టోరీలో స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయని నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్, లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి, డిఓపి నిఖిత్ బొమ్మి సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
డైరెక్టర్ కీర్తిశ్వరన్ చెప్పినట్టుగా.. డ్యూడ్ కాన్సెప్ట్ ఆర్య, ఆర్య 2 సినిమాల స్క్రిప్ట్ని గుర్తుచేసేలా ఉంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఐకాన్ ఫ్యాన్స్ని అలర్ట్ చేసేలా, అట్ట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మూవీ చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
సాధారణంగా హీరో ప్రదీప్ రంగనాధ్.. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. యూనిక్ స్టైల్, స్వాగ్, అల్లరి చేసే కామెడీ.. హీరో ధనుష్ని మైమరిచే విధంగా ఉండేలా చేశాడు. ఎలా అంటే.. ప్రదీప్ నుంచి సినిమా వస్తుందంటే.. 90% హిట్ అయిపోద్ది.. అనేలా ఓ మార్క్ క్రియేట్ చేసాడు. తెలుగులో నాని, తమిళంలో ధనుష్ మాదిరి.. తనకంటూ స్పెషల్ సిగ్నేచర్ క్రియేట్ చేసుకున్నాడు.
ఇపుడు డ్యూడ్లో కాలేజీ లైఫ్.. హీరోయిన్స్ మమిత బైజు,నేహా శెట్టిలతో ప్రదీప్ కెమిస్ట్రీ, లవ్, ఎమోషన్ సీన్స్ కొత్త తరహాలో అనిపిస్తాయి. అయితే, డ్యూడ్ సినిమా చాలా బాగుందని కొందరు మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం సెకండాఫ్ పోయిందని అంటున్నారు. అయితే.. డే1 గడిస్తే తప్ప ఏ సినిమాకు అసలైన టాక్ బయటకి రాదు. ఇలా ఫస్ట్ షోతోఇనే టాక్ డిసైడ్ అయి ఫలితం మార్చేయదు. సో వెయిట్ అండ్ సి!!!