రూ.8 లక్షల లంచంతో దొరికిన IPS ఆఫీసర్ : ఇంట్లో సోదాలు చేస్తే కోట్లకు కోట్లు బయటపడ్డాయి..

రూ.8 లక్షల లంచంతో దొరికిన IPS ఆఫీసర్ : ఇంట్లో సోదాలు చేస్తే కోట్లకు కోట్లు బయటపడ్డాయి..

అతనో ఐపీఎస్​ఆఫీసర్.. మంచి హోదా.. లక్షల్లో జీతం.. లగ్జరీ లైఫ్​..అయినా కక్కుర్తి పడ్డాడు.. ఓ చిన్న కేసును సెటిల్​ మెంట్  చేసేందుకు లక్షల్లో లంచం డిమాండ్​ చేశారు.. దఫాలు వారీగా చెల్లించాలని బాధితుడిని ఆర్డర్​ వేశారు. అతని అరాచకం అలా సాగుతుండగా..  ఇంతలో సీబీఐ ఎంట్రీ.. ఇంట్లో సోదాలు.. కోట్లలో నోట్ల కట్టలు గుట్టగుట్టలుగా బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే..  

చండీగఢ్:  పంజాబ్​ డీఐజీ  హరిచరణ్ సింగ్​ భుల్లర్​ ను సీబీఐ అరెస్ట్​ చేసింది. శుక్రవారం (అక్టోబర్​ 17) లంచం తీసుకున్నారనే ఆరోపణలపై పంజాబ్ డీఐజీ హర్చరణ్ సింగ్ భుల్లార్ నుండి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్ట్ చేసింది.భుల్లర్​ ఇంట్లో సోదాలు నిర్వహించిన సీబీఐ.. రూ.5 కోట్ల నగదు, 1.5 కిలోల బంగారం, లగ్జరీ కార్లు ,ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకుంది.భుల్లార్‌తో పాటు మరొక వ్యక్తిని సీబీఐ అరెస్టు చేసింది.

భుల్లార్ నివాసంలో సోదాలు చేసిన సీబీఐ రూ.5 కోట్ల నగదు, 1.50 కిలోల ఆభరణాలు, ప్రాపర్టీ డాక్యుమెంట్లు, రెండు లగ్జరీ కార్టు, , 22 లగ్జరీ వాచ్​ లు, లాకర్ కీలు, 40 లీటర్ల దిగుమతి చేసుకున్న మద్యం, డబుల్ బ్యారెల్ గన్, పిస్టల్, రివాల్వర్, ఎయిర్‌గన్‌తో సహా తుపాకీలతో పాటు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఫతేఘర్ సాహిబ్‌లోని మండి గోవింద్‌గఢ్‌కు చెందిన స్క్రాప్ డీలర్ చేసిన ఫిర్యాదు మేరకు భుల్లర్‌ను మొహాలీ కార్యాలయం నుంచి అరెస్టు చేశారు. సీనియర్ పోలీసు అధికారి తనపై 2023 ఎఫ్‌ఐఆర్‌ను సెటిల్ చేసినందుకు నెలవారీ చెల్లింపును డిమాండ్ చేస్తున్నారని స్క్రాప్​ డీలర్​ ఆరోపించారు. 

ఈ కేసులో కిర్షాను అనే మధ్యవర్తిని కూడా అరెస్టు చేశారు. సీబీఐ అధికారులు అతని నుంచి రూ.21 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.