
IRCTC Portal Down: వారాంతంలో ధనత్రయోదశి కొత్త వారంలో దీపావళి వస్తున్న తరుణంలో ప్రయాణికులు తమ స్వస్థలాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమ ప్రయాణాల కోసం భారతీయ రైల్వేలను ఎక్కువగా వాడుతుంటారు. దీంతో ఐఆర్సీటీసీ యాప్, వెబ్‌సైట్ ఒక్కసారిగా పనిచేయటం ఆగిపోయాయి. దీంతో చాలా మంది ప్రయాణికులు టిక్కెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. పీక్ ప్రయాణ సమయంలో సమస్య ఏర్పడటంతో తత్కాల్, కోటా టిక్కెట్ల బుక్కింగ్ నిలిచిపోయింది.
చివరి నిమిషంలో ప్రయాణాల కోసం లక్షల మంది ఒక్కసారిగా టిక్కెట్ బుక్కింగ్ పోర్టల్ సందర్శన వల్ల ఏర్పడిన టెక్నికల్ సమస్యలు దీనికి కారణంగా ఐఆర్సీటీసీ అధికారులు చెబుతున్నారు. టెక్నికల్ టీం దీనిని పరిష్కరించటానికి క-ృషి చేస్తోందని చెబుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది యూజర్లు సైట్ డౌన్, ఎర్రర్ వస్తున్న టిక్కెట్ బుక్కింగ్ పోర్టల్ స్కీన్ షార్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా పీక్ బుక్కింగ్ సమయాల్లో ఐఆర్సీటీసీ పోర్టల్ క్రాష్ కావటం ఇదే తొలిసారి కాదు.
దీంతో చేసేది లేక సమయానికి టిక్కెట్లు దొరక్కపోవటంతో చాలా మంది ప్రత్యామ్నాయ రవాణా కోసం ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు. మరికొందరు నేరుగా రైల్వేస్టేషన్లలోని ఫిజికల్ టిక్కెట్ బుక్కింగ్ కౌంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. చాలా మంది ఎప్పుడెప్పుడు సేవలు తిరిగి దారికి వస్తాయని రైల్వే సంస్థ ప్రకటిస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఇది పేలవంగా ఉన్న రైల్వే డిజిలస్ ఇన్ ఫ్రా గురించి ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రతిసారీ ఇలా జరుగుతున్నప్పటికీ రైల్వే సంస్థ ఎందుకు దానికి తగినట్లుగా ప్రెపేర్ అవ్వటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో.