ఆధార్‌‌‌‌‌‌‌‌, యూపీఐ, డిజీలాకర్‌‌‌‌‌‌‌‌తో ఎకానమీకి మరింత మేలు

ఆధార్‌‌‌‌‌‌‌‌, యూపీఐ, డిజీలాకర్‌‌‌‌‌‌‌‌తో ఎకానమీకి మరింత మేలు
  •     ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని

న్యూఢిల్లీ : ప్రభుత్వం తీసుకొచ్చిన ఆధార్‌‌‌‌‌‌‌‌, యూపీఐ, డిజీలాకర్‌‌‌‌‌‌‌‌ వంటి డిజటల్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌తో  చిన్న చిన్న ఇన్‌‌‌‌ఫార్మాల్ సెక్టార్ ఎకానమీలు కలిసి అతిపెద్ద ఎకానమీగా మారుతాయని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్‌‌‌‌ నిలేకని అన్నారు. వచ్చే 20 ఏళ్ల వరకు  ఇదే ట్రెండ్ కనిపిస్తుందని అంచనా వేశారు. టెక్నాలజీ సాయంతో పనిచేసే డిజిటల్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌  భారీ స్థాయిలో సమస్యలను  పరిష్కరిస్తుందని బీ20 సమ్మిట్‌‌‌‌లో ఆయన పేర్కొన్నారు.

‘ఏదైనా డిజిటల్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ను వాడితే డేటా క్రియేట్ అవుతుంది. ఇండివిడ్యువల్స్‌‌‌‌, కంపెనీలు తమ డేటాను మానిటైజ్‌‌‌‌ చేసుకోవడానికి  ఇండియా ఒక యునిక్ ఐడియాతో వచ్చింది. ఈ డేటానే వీరి డిజిటల్‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌. ఇండివిడ్యువల్స్ తమ డిజిటల్‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌తో జీవితంలో ముందుకెళ్లొచ్చు. ఈ కాన్సెప్ట్‌‌‌‌ ప్రపంచంలో ఇంకెక్కడ లేదు’ అని నందన్ నిలేకని చెప్పారు.  

ప్రపంచం ఇన్నోవేషన్స్‌‌‌‌, రెగ్యులేషన్‌‌‌‌ను బ్యాలెన్స్ చేయడానికి కష్టపడుతుంటే, డేటా గవర్నెన్స్‌‌‌‌ ద్వారా ఇండియా ఇప్పటికే బ్యాలెన్స్‌‌‌‌ సాధించిందని అన్నారు. కరోనా టైమ్‌‌‌‌లో 4.5 బిలియన్ డాలర్లను 15 కోట్ల బ్యాంక్ అకౌంట్లకు డిజిటల్ పేమెంట్స్ ద్వారా ట్రాన్స్‌‌ఫర్ అయ్యాయని, 70 కోట్ల మంది బ్యాంక్‌‌‌‌ అకౌంట్‌‌‌‌లు వారి ఆధార్‌‌‌‌‌‌‌‌ కార్డులతో లింక్ అయి ఉన్నాయని ఉదాహరణగా చెప్పారు. యూపీఐ ప్రపంచంలోనే అత్యంత కీలకమైన పేమెంట్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌గా మారిందని, ప్రతీ నెల 966 కోట్ల ట్రాన్సాక్షన్‌‌‌‌లు ఈ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌పై జరుగుతున్నాయని  వివరించారు. 130 కోట్ల మంది ప్రజలు ఆధార్ వాడుతున్నారని, రోజుకి 8 కోట్ల ఐడెంటిటీ అథంటికేషన్‌‌‌‌ ట్రాన్సాక్షన్‌‌‌‌లు జరుగుతున్నాయని చెప్పారు. 47 ఏళ్లలో జరగాల్సింది 9 ఏళ్లలో ఇండియా చేసి చూపిందని 
పేర్కొన్నారు.