ఇన్ఫోసిస్ కో ఫౌండర్ గొప్ప మనసు.. ఐఐటీ బాంబేకి వందల కోట్లు విరాళం!

ఇన్ఫోసిస్ కో ఫౌండర్ గొప్ప మనసు.. ఐఐటీ బాంబేకి వందల కోట్లు విరాళం!

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ నందన్ నీలేకని మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఐఐటీ బాంబేతో తన 50ఏళ్ల అనుబంధానికి గుర్తుగా రూ.315 కోట్లను విరాళమిచ్చారు. ఆయన 1973లో ఐఐటీ బాంబేలో విద్యనభ్యసించారు. ఎలక్ట్రికల్​ ఇంజినీరింగ్​ నుంచి బ్యాచిలర్స్​ డిగ్రీ పొందారు. ఆ కృతజ్ఞతకు గుర్తుగా.. ఈ విధంగా రుణం తీర్చుకుంటున్నారు.

"నా జీవితంలో ఐఐటీ బాంబే పాత్ర మరవలేనిది. నా ప్రయాణానికి పునాది రాళ్లు ఇక్కడే పడ్డాయి. నా ప్రొఫెషనల్​ కెరీర్‌ను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దిన విద్యాసంస్థ ఐఐటీ బాంబే. ఈ అనుబంధానికి నేటితో 50ఏళ్లు గడిచాయి. అందుకు గుర్తుగా రూ.315కోట్లు విరాళం ఇస్తున్నాను. భవిష్యత్తులో మా అనుబంధం ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నా. ఇది ఆర్థికపరమైన విరాళం మాత్రమే కాదు. అంతకు మించి. రేపటి ప్రపంచాన్ని తీర్చిదిద్దే విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.." అని నందన్​ నీలేకని తెలిపారు.

"This donation is more than just a financial contribution; it is a tribute to the place that has given me so much and a commitment to the students who will shape our world tomorrow," #Infosys co-founder #NandanNilekani said.

Read here: https://t.co/uoA20Xkf5n pic.twitter.com/93hnw6j77M

— Mint (@livemint) June 20, 2023

నందన్​ నీలేకని​ విరాళంగా ఇచ్చిన డబ్బును ప్రపంచస్థాయి మౌలిక వసతులను వర్సిటీలో ఏర్పాటు చేసేందుకు, ఇంజినీరింగ్​- టెక్నాలజీలో పుట్టుకొస్తున్న నూతన అంశాలపై రీసెర్చ్​ చేసేందుకు ఉపయోగించనున్నట్టు ఐఐటీ బాంబే వెల్లడించింది. విద్యాసంస్థ చరిత్రలో అతిపెద్ద విరాళం ఇదేనని తెలిపింది.

కాగా, నందన్​ నీలేకని గతంలో ఐఐటీ బాంబేకు రూ.85కోట్లను విరాళంగా ఇచ్చారు. తాజా విరాళంతో ఆ సంఖ్య రూ. 400కోట్లకు చేరింది.