ఇన్ఫోసిస్‌‌ సలీల్ పరేఖ్ శాలరీ రూ.79.75 కోట్లు..

ఇన్ఫోసిస్‌‌ సలీల్ పరేఖ్ శాలరీ రూ.79.75 కోట్లు..

న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్‌‌ సీఈఓ సలీల్‌‌ పరేఖ్ జీతం ఏడాదికి రూ.79.75 కోట్లకు పెరిగింది. ఇందులో రూ.11 కోట్లు ఫిక్స్‌‌డ్‌‌ శాలరీ కాగా, మిగిలిన రూ.68.75 కోట్లు ఫెర్ఫార్మెన్స్‌‌ బట్టి ఇచ్చే రెమ్యూనిరేషన్‌‌. ఈ కొత్త ఎంప్లాయ్‌‌మెంట్‌‌ అగ్రిమెంట్‌‌ జులై 2 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ అగ్రిమెంట్‌‌కు ఇంకా షేరు హోల్డర్ల నుంచి అప్రూవల్స్ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన శాలరీ రూ.42 కోట్లు. కంపెనీ గ్రోత్‌‌ పెరగడంతో ఆయనకు ఇచ్చే కాంపెన్సేషన్‌‌లు  కూడా భారీగా పెరిగాయి. ఇన్ఫోసిస్ సీఈఓగా మరో ఐదేళ్ల పాటు సలీల్ పరేఖ్ నియమితులయిన విషయం తెలిసిందే. జులై 1 నుంచి ఆయన కొత్త టెర్మ్‌‌ స్టార్టవుతోంది. అంతకంటే ముందే  ఆయనకు ఇచ్చే జీతాన్ని  కంపెనీ 88 శాతం పెంచడం గమనించాలి. 2021–22 లో పరేఖ్ రూ. 71 కోట్లను కాంపెన్సేషన్‌‌ కింద అందుకున్నారు. ఇందులో రూ. 52 కోట్లు ఆయనకు ఇచ్చిన రిస్ట్రిక్టడ్‌‌ స్టాక్ యూనిట్స్‌‌ (ఆర్‌‌‌‌ఎస్‌‌యూ) నుంచి దక్కాయి. భారీగా శాలరీ పెరగడంతో ఇన్ఫోసిస్‌‌లోని సగటు ఉద్యోగి శాలరీకి, సలీల్‌‌ పరేఖ్ శాలరీకి మధ్య అంతరం బాగా పెరిగింది. 

మరిన్ని వార్తల కోసం

పెంపుడు కుక్కతో వాకింగ్​ కోసం స్టేడియం ఖాళీ

15 నిమిషాల వర్షానికే ఆగమాగం