అక్షతకు ఇన్ఫోసిస్‌‌‌‌లో బిలియన్ డాలర్ల వాటా

అక్షతకు ఇన్ఫోసిస్‌‌‌‌లో బిలియన్ డాలర్ల  వాటా
  • ఆమె వ్యక్తిగత ఆస్తి 300 మిలియన్ పౌండ్లను దాటేసింది: సండే టైమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  • గత కొన్ని నెలలుగా రిషి సునక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అక్షతలపై  బ్రిటన్ మీడియాలో నెగెటెవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్తలు
  • పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, సొంత పార్టీలోనూ తగ్గుతున్న సునక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాపులారిటీ

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కూతురు, యూకే ఫైనాన్స్​ మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిషి సునక్ భార్య అయిన అక్షత మూర్తి (42) సంపద బ్రిటన్‌‌  రాణి సంపదను దాటేసింది. ఆమె సంపద  బ్రిటన్‌‌ రాణి ఎలిజిబిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2   వ్యక్తిగత సంపద కంటే ఎక్కువని  తాజాగా ఓ రిపోర్ట్ వెల్లడించింది. అక్షతకు ఒక్క ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే బిలియన్ డాలర్ల విలువైన వాటా ఉండగా,  ఎలిజిబిత్ సంపద  450 మిలియన్ డాలర్లు (350 మిలియన్  పౌండ్లు)గా ఉందని 2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌021 సండే టైమ్స్ రిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. అక్షత, రిషి సునక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కెన్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  7 మిలియన్ పౌండ్ల విలువైన ఫైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌస్ ఒకటి ఉందని, కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో ఓ ఫ్లాట్ కూడా ఉందని సండే టైమ్స్ పేర్కొంది. అక్షత వివిధ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో కూడా ఇన్వెస్ట్ చేశారు. రిషి సునక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆమె 2013 లో కేటమరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంచర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు. ఈ  కంపెనీలో ఆమె డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నారు.  అంతేకాకుండా అక్షత డిజైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో సొంతగా ఫ్యాషన్ లేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా ఆమె  క్రియేట్ చేశారు. 

రిషి సునక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పెరుగుతున్న విమర్శలు..
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం స్టార్టయినప్పటి నుంచి బ్రిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిషి సునక్ పాపులారిటీ తగ్గుతోంది. రిషి భార్య అక్షతకు  ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాటా ఉన్న విషయం తెలిసిందే. రష్యాలో ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలను నిలిపివేయడం లేదని గతంలో విమర్శలు వచ్చాయి. దీనిపై సునక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బ్రిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా విమర్శించడాన్ని చూడొచ్చు. ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని, రష్యా నుంచి ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బయటకు వచ్చేసేలా చేయాలని తన భార్యకు చెప్పలేనని అప్పుడు రిషి సునక్ పేర్కొన్నారు కూడా. ఆ తర్వాత రష్యా నుంచి ఇన్ఫోసిస్ బయటకు వచ్చేసింది. అయినప్పటికీ రిషి సునక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అక్షతలపై విమర్శలను  బ్రిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా ఆపలేదు. తాజాగా అక్షత  వ్యక్తిగత సంపదపై విమర్శలు చేస్తున్నాయి. ఆమె యూకేలో ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టడం లేదని విమర్శిస్తున్నాయి. ఈ అంశాలు పరోక్షంగా రిషి సునక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాపులారిటీపై నెగెటివ్ ప్రభావం చూపుతున్నాయి. అక్షత మూర్తికి ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని వాటాలకు అదనంగా  300 మిలియన్ పౌండ్ల వ్యక్తిగత సంపద ఉందని బ్రిటన్ మీడియా పేర్కొంది.  

రూల్ కాకపోయినా ట్యాక్స్ కడతా..
అక్షత మూర్తికి బ్రిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–డొమిసైల్​ స్టేటస్ ఉంది. దీనర్ధం  ఆమె పర్మినెంట్ అడ్రస్ బ్రిటన్ కాదు. దీంతో అక్షతకు విదేశాల నుంచి వచ్చే ఎర్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. తాజాగా  బ్రిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆమె ట్యాక్స్ కట్టడం లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి. విదేశాల్లోని ఆస్తులు, బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా వచ్చిన ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డివిడెండ్స్, క్యాపిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కూడా యూకేలో ట్యాక్స్ కడతానని అక్షత తాజాగా  ప్రకటించారు. ‘రూల్స్ వలన కాదు నాకు కట్టాలని ఉంది కాబట్టి ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కడతా’ అని ఆమె పేర్కొన్నారు.  యూకే రూల్స్ వలన ఇప్పటి వరకు విదేశీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కట్టకుండా వస్తున్నా ఆమె ఇక నుంచి  ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కడతానని ప్రకటించారు. ‘నా ట్యాక్స్ స్టేటస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నా భర్తపై లేదా నా ఫ్యామీలిపై ఎటువంటి ప్రభావం చూపకూడదని కోరుకుంటున్నాను’ అని అక్షత పేర్కొన్నారు. కాగా, బ్రిటన్ ప్రజలకు రిషి సునక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూరంగా ఉంటున్నారని, లగ్జరీ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనుభవిస్తున్నారని గత కొంత కాలంగా మీడియాలో  వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో  రిషి సునక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తోంది. ఆయన పాపులారిటీని గాడిలో పెట్టేందుకు రిషి, అక్షతలు ప్రయత్నిస్తున్నట్టు 
కనిపిస్తోంది.