దమ్మపేట, వెలుగు: దమ్మపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులు మాయమయ్యాయి. మంగళవారం రాత్రి దుండగులు కార్యాలయం తాళాలు పగులగొట్టారు. 2024–25 సంవత్సరానికి సంబంధించిన రికార్డులు, ఇంటి పన్ను వసూలు చేసిన రశీదు పుస్తకాలు, ఇతర ముఖ్యమైన పత్రాలను దొంగిలించారు.బుధవారం ఉదయం కార్యాలయాన్ని తెరవడానికి వచ్చిన కార్యదర్శి చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో వేలిముద్రలు సేకరించారు.
