బడ్జెట్‌‌‌‌లో పీయూకు మళ్లీ మొండిచేయి

బడ్జెట్‌‌‌‌లో పీయూకు మళ్లీ మొండిచేయి

మహబూబ్​నగర్​, వెలుగు: పాలమూరు యూనివర్సిటీకి బడ్జెట్‌‌‌‌ కేటాయింపుల్లో మళ్లీ మొండిచేయి చూపించారు. వరుసగా మూడోయేడూ జీతాలకు తప్ప, డెవలప్​మెంట్‌‌‌‌కు పైసా ఇవ్వలేదు. దీంతో స్టూడెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పీడీఎస్‌‌‌‌యూ ఆధ్వర్యంలో పీయూ ఎదుట నిరసన తెలిపారు. హాస్టళ్లు, ప్లేగ్రౌండ్స్ లేక ఇబ్బందులు పడుతున్నామని, రీసెర్చ్‌‌‌‌లకూ నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. పాలమూరు ఎంపీగా ఉన్న సమయంలో​పీయూను సొంత ఇంటిలా అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్‌‌‌‌‌‌‌‌ హామీ ఏమైందని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లయినా ఫండ్స్​ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.  

2017 నుంచీ అరకొర నిధులే...

ప్రభుత్వం 2017 నుంచి పీయూకు సరిపడా ఫండ్స్​ఇవ్వడం లేదు. 2017–-18  బడ్జెట్‌‌‌‌లో జీతాలకు రూ.5.7 కోట్లు, డెవలప్‌‌‌‌మెంట్​ కోసం రూ.10 కోట్లు, 2018–-19 జీతాలకు రూ.6.7 కోట్లు కేటాయించగా.. అభివృద్ధికి పైసా ఇవ్వలేదు.  2019–-20లో జీతాలకు రూ.6.63 కోట్లు ఇవ్వగా, డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌కు రూ.90 లక్షలు కేటాయించారు. 2020-–21లో రూ.7.36 కోట్లు, 2021–-22లో రూ.7.50 కోట్లు, 2022-23లో రూ.9.85 కోట్లు జీతాలకు మాత్రమే మంజూరు చేశారు.   2023-–24 బడ్జెట్‌‌‌‌లో రూ.84 కోట్లు కావాలని ఆఫీసర్లు ప్రతిపాదనలు పంపగా.. సర్కారే కేవలం రూ.10.91 కోట్లను కేటాయించింది.  

తీవ్రంగా హాస్టళ్ల సమస్య

పీయూలో ప్రస్తుతం ఒక గర్ల్స్​ హాస్టల్ ఉంది. ప్రతి కోర్సులో స్టూడెంట్ల సంఖ్యను పెంచడంతో ఈ హాస్టల్​ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో పక్కనే ఉన్న కస్తూర్బా బిల్డింగ్​ను రెంట్‌‌‌‌కు తీసుకొని వాడుకుంటున్నారు. అందులోనూ నలుగురు ఉండాల్సిన రూమ్స్​లో పది మంది స్టూడెంట్లు ఉండాల్సి వస్తోంది.  నిరుడు గర్ల్స్​హాస్టల్​ కొత్త బిల్డింగ్ ​స్టార్ట్​ చేసినా.. ఫండ్స్​లేక  పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.  బాయ్స్​ హాస్టళ్లు ప్రస్తుతం మూడు ఉండగా.. మరో మూడు  అవసరం ఉన్నాయి. గత అకడమిక్​ ఇయర్​ నుంచి పీహెచ్‌‌‌‌డీ కోర్సులను ప్రవేశపెట్టారు. ఇందులో చేరే స్టూడెంట్స్ రీసెర్చ్​ చేసుకునేందుకు వీలుగా  ఒక్కొక్కరికి ఒక్కో రూమ్​అలాట్​ చేయాల్సి ఉంది.  కానీ, సరిపడా రూమ్స్​లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న హాస్టల్స్​ రూమ్‌‌‌‌లనే వారికి అలాట్​ చేస్తున్నారు. అలాగే వనపర్తిలో పీజీ బిల్డింగ్​పూర్తి కాగా, హాస్టల్​ నిర్మించాల్సి ఉంది. 

పీయూలోని సమస్యలు

l. 2008-–09లో పీయూను స్థాపించగా, ఇప్పటి వరకు గ్రౌండ్ లేదు.  స్పోర్ట్స్​ గ్రౌండ్​ కోసం దాదాపు 15 ఎకరాలు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుతం ఇండోర్​ స్టేడియం మాత్రమే అందుబాటులో ఉంది.  ఫిజికల్​ డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిమ్స్​లో సరిపడా వస్తువులు లేవు.
2. నాన్​ టీచింగ్​ పోస్టులు భర్తీ చేయలేదు. అసిస్టెంట్,అసోసియేట్​ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
3.  పీహెచ్​డీ స్టూడెంట్లకు పరిశోధనలు చేసుకోవడానికి సరైన వసతులు లేవు. 
4. లైబ్రరీలో సరిపడా పుస్తకాలు లేవు. కేవలం కాంపిటేటివ్​కు ఎగ్జామ్స్​కు సంబంధించి రూ.4 లక్షలతో మెటీరియల్​ను తెప్పించారు.  అకడమిక్​ ఇయర్​కు సంబంధించిన చాలా పుస్తకాలు అందుబాటులో లేవు.
5. ఫార్మా కాలేజ్​లో కెమికల్స్​ లేవు. దీంతో రీసెర్చ్​ల కోసం స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారు.

డెవలప్​మెంట్​ పరిస్థితి ఏంటి?

పీయూ నుంచి రూ.84 కోట్లతో ప్రతిపాదనలు పంపితే కేవలం రూ.10.90 కోట్లు కేటాయించడం సరికాదు.  ఈ నిధులు సిబ్బంది జీతభత్యాలకే సరిపోతాయి. మరి డెవలప్​మెంట్​పరిస్థితి ఏంటి? హాస్టళ్లు, గ్రౌండ్లు లేక స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నరు. 
–మారుతి, పీడీఎస్‌‌‌‌యూ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్​నగర్​ 

విద్యకు కేవలం 6.7 శాతం నిధులా..?

విద్యా రంగానికి కేటాయించిన 6.7 నిధులు దేనికీ సరిపోవు. 30 శాతం కేటాయించాలని అడిగినా సర్కారు పట్టించుకోలేదు. పేద విద్యార్థులను విద్యకు దూరం చేయాలని కుట్ర చేస్తున్నట్లుంది.  పీయూలో కొత్తకోర్సులకు సరిపడా బిల్డింగ్స్ లేవు.  
నటరాజ్, ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ నెంబర్ 

రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు

పీయూలో రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు.  కాంట్రాక్టు ఫ్యాకల్టీతోనే నెట్టుకొస్తున్నరు.  సరిపడా బుక్స్, ల్యాబుల్లో కెమికల్స్‌‌‌‌ కూడా లేవు. అంబులెన్స్, డాక్టర్‌‌‌‌‌‌‌‌ కూడా లేరు. లేడీస్ హాస్టళ్లలో ఒక్కో రూమ్‌‌‌‌లో 10 నుంచి  20 మంది దాకా ఉంటున్నారు.  
గణేష్, ఎంఎస్ఎఫ్, యూనివర్సిటీ అధికార ప్రతినిధి